Guntur Kaaram: డైరెక్షన్ మానేసి పర్యవేక్షణ మాత్రమే చేసుకో గురూజీ..!

త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే ప్రాసలు, పంచ్ డైలాగ్స్ తో చేసే మాటల మాయాజాలం, కుటుంబం అంతా కలిసి చూడగలిగే సినిమాలు మాత్రమే కాకుండా యువతని ఆలోచింపజేసే స్పీచ్ లు, రాకెట్ సైన్స్ ని పామరుడికి సైతం అర్తమయ్యేలా వివరించగల గొప్ప వక్త గుర్తొస్తాడు. రైటర్ గా తన జర్నీ మొదలుపెట్టిన త్రివిక్రమ్ నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా మారి తనదైన ప్రత్యేక శైలిలో సినిమాలు చేస్తూ వరుస హిట్స్ తో టాప్ డైరెక్టర్ స్థాయికి చేరుకున్నాడు.

అరవింద సమేత సినిమాతో తాను క్లాస్ సినిమాలు మాత్రమే కాదు మాస్ సినిమాలు కూడా చేయగలను అని ప్రూవ్ చేసుకున్నాడు. త్రివిక్రమ్ సినిమాలు థియేటర్లో మాత్రమే కాదు, టీవీల్లో వచ్చినా కూడా రిపీట్ మోడ్ లో చూడచ్చని అతడు, ఖలేజా వంటి సినిమాలు ప్రూవ్ చేశాయి. అజ్ఞాతవాసి సినిమాతో డిజాస్టర్ చవిచూసిన త్రివిక్రమ్ తర్వాత తక్కువ టైమ్ లోనే అరవింద సమేత, ఆలా వైకుంఠపురంలో వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకొని తన సత్తా చాటాడు.

అయితే, అల వైకుంఠపురంలో సినిమా తర్వాత మెగాఫోన్ పక్కన పెట్టిన గురూజీ పవన్ కళ్యాణ్ సినిమాలకు దర్శకత్వ పర్యవేక్షణ చేయటం మొదలు పెట్టాడు. వకీల్ సాబ్ మొదలుకొని భీమ్లా నాయక్, ప్రస్తుతం రిలీజ్ కి సిద్ధంగా ఉన్న బ్రో, సుజిత్ డైరెక్షన్లో రూపొందుతున్న ఓజి సినిమాల్లో కూడా గురూజీ ఇన్వాల్వ్ అవుతున్నాడు. ఈ క్రమంలో మహేష్ బాబుతో కమిట్ అయిన గుంటూరు కారం సినిమా మీద మాత్రం సరిగ్గా దృష్టి పెట్టట్లేదు.

- Advertisement -

చాలా కాలం కిందట మొదలైన ఈ సినిమా షూటింగ్ వివిధ కారణాలతో చాలా సార్లు వాయిదా పడుతూ వస్తూ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన తయారయ్యింది. ఒక పక్క షూటింగ్ వాయిదా పడటంతో పాటు, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తప్పుకున్నాడన్న పుకార్లు, హీరోయిన్ పూజ హెగ్డేను తప్పించి మీనాక్షిని తీసుకోవటం, స్టంట్ మాస్టర్ ని చేంజ్ చేయటం, తాజాగా సినిమాటోగ్రాఫర్ పీఎస్ వినోద్ ని తప్పించి రవి కె చంద్రన్ తీసుకోవటం వంటి సంఘటనలు మహేష్ అభిమానుల ఆగ్రహానికి కారణం అవుతున్నాయి.

పవన్ కళ్యాణ్ సినిమాల మీద పెట్టిన శ్రద్ధలో సగం కూడా గుంటూరు కారం సినిమా మీద పెట్టట్లేదని మహేష్ ఫ్యాన్స్ గురుజీపై ఫైర్ అవుతున్నారు. గుంటూరు కారం సినిమా షూటింగ్ కూడా పూర్తి కాకముందే అల్లు అర్జున్ తో సినిమా అనౌన్స్ చేయటంతో ఈ సినిమా అసలు పూర్తవుతుందా లేదా అన్న అనుమానాలు కూడా మొదలయ్యాయి. ఏది ఏమైనా డైరెక్టర్ అన్న వాడు ఒక సినిమా కమిట్ అయితే, ఆ సినిమా షూటింగ్ నుండి ప్రమోషన్స్, రిలీజ్ వరకు దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది.

అలాంటిది, త్రివిక్రమ్ పక్క సినిమాల పర్యవేక్షణ మోజులో పడి, కమిట్ అయిన సినిమాలను గాలికి వదిలేసి ఆ సినిమా నిర్మాతల  డబ్బుని, హీరోల డేట్స్ వేస్ట్ చేయటంకంటే డైరెక్షన్ పూర్తిగా మానేసి తన స్వామి పవన్ కళ్యాణ్ సినిమాలకు దర్శకత్వ పర్యవేక్షకుడిగా సెటిల్ అయితే ఇండస్ట్రీకి కూడా మంచి చేసిన వాడవుతాడు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు