Family Star : కొత్త రిలీజ్ డేట్… రిస్క్ అవసరమా రౌడీ?

చాలా కాలంగా యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండకు సరైన హిట్ లేదు. “అర్జున్ రెడ్డి”తో యూత్ ను ఓ ఊపు ఊపేసిన దేవరకొండకు ఆ తరువాత ఎన్ని ప్రయత్నాలు చేసినా, అలాంటి హిట్ మాత్రం పడలేదు. ఆయన గత సినిమాలు “లైగర్”, “ఖుషి” బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. తన కొత్త చిత్రం “ఫ్యామిలీ స్టార్”పైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు విజయ్. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ ‘ఫ్యామిలీ స్టార్” మూవీ సంక్రాంతి రేసులో నుంచి తప్పుకుందని, పోస్ట్ పోన్ అవుతుందనే వార్త టాలీవడ్ ను షేక్ చేస్తోంది.

“గుంటూరు కారం”, “సైంధవ్” వంటి కొన్ని స్టార్ హీరోల సినిమాలు దాదాపు అదే సమయంలో విడుదల అవుతుండడంతో “ఫ్యామిలీ స్టార్” 2024 సంక్రాంతికి విడుదల కాకపోవచ్చు అని టాక్ నడుస్తోంది. అయితే తాజాగా ఫిల్మీఫైకి అందిన సమాచారం ప్రకారం ఈ మూవీకి కొత్త రిలీజ్ డేట్ ను సెట్ చేసే పనిలో పడ్డారట మేకర్స్. అందుకోసం వచ్చే ఏడాదిలో రెండు తేదీలను పరిశీలిస్తున్నారట. మార్చి 8 లేదా మార్చి 22న మూవీని థియేటర్లలోకి తీసుకొచ్చే యోచనలో ఉన్నారట. కానీ ఇప్పటికే హిట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్న రౌడీ హీరోకు రెండు తేదీలు కూడా కలిసొచ్చే అవకాశం లేనట్టు తెలుస్తుంది.

ఒకవేళ ఈ వార్త గనుక నిజమైతే విజయ్ దేవరకొండ రిస్క్ చేస్తున్నట్టే. మార్చి నెలలో పిల్లలకు ఎగ్జామ్స్ ఉంటాయి. అసలు ఎవరూ థియేటర్ల వైపుకు తొక్కి చూడరు. మరి అలాంటి టైంలో మేకర్స్ సినిమాను రిలీజ్ చేయాలనీ ఎందుకు అనుకుంటున్నారనేది ఇప్పుడు అంతుచిక్కని ప్రశ్న. ఒకవేళ అదే డేట్ ను మేకర్స్ ఫిక్స్ చేస్తే రౌడీ హీరో రిస్క్ చేయడానికి రెడీగా ఉంటాడా? అన్నది మరో ప్రశ్న. దానికి సమాధానం తెలియాలంటే మేకర్స్ అధికారికంగా మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసేదాకా ఆగాల్సిందే. ఇక “ఫ్యామిలీ స్టార్” చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహించగా, దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వీలైనంత త్వరగా మూవీ షూటింగ్ ను పూర్తి చేసే పనిలో పడ్డారు మేకర్స్. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ నోయిడాలో జరుగుతోంది. లీడ్ పెయిర్ విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్‌లు షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఇక 15 రోజుల షెడ్యూల్ కోసం మూవీ యూనిట్ ఈ నెల 29న యూఎస్ వెళ్లనుంది.

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు