Kubera: ఇది శేఖర్ కమ్ములకు మాత్రమే సాధ్యం

శేఖర్ కమ్ముల ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న చాలామంది దర్శకులుది ఒక తీరు, శేఖర్ కమ్మలది మాత్రం ఒక తీరు. తన రూటే సపరేటు. డాలర్ డ్రీమ్స్ అనే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు శేఖర్ కమ్ముల. అయితే ఆ సినిమాకి అవార్డులు వచ్చాయి గాని కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన సినిమా ఆనంద్. ఈ మంచి కాఫీలాంటి సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

ఈ సినిమా చూస్తున్నంత సేపు లైబ్రరీలో కూర్చొని ఒక అద్భుతమైన పుస్తకాన్ని చదివిన అనుభూతిలా అనిపిస్తుంది. కొన్ని సినిమాలు మినహాయిస్తే శేఖర్ కమ్ముల దాదాపు చేసిన సినిమాలన్నీ కూడా అలానే ఉంటాయని చెప్పొచ్చు. శేఖర్ కమ్ముల సినిమాల్లో ఒకటి రెండు సినిమాలు తప్ప మిగతా సినిమాలన్నీ కూడా మంచి అనుభూతినిచ్చినవే. ఇకపోతే లేటెస్ట్ గా లవ్ స్టోరీ అనే సినిమాతో కూడా మంచి సక్సెస్ అందుకున్నాడు శేఖర్.

ఇక శేఖర్ కమ్ముల ప్రస్తుతం ధనుష్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతోంది. రీసెంట్ గా ఈ సినిమాకి కుబేర అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ అఫీషియల్ అనౌన్స్మెంట్ తో పాటు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

- Advertisement -

రిలీజ్ చేసిన పోస్టర్ మంచి ఆసక్తిని కలిగిస్తుంది. కుబేర అనే టైటిల్ని పెట్టి ధనుష్ ని ఒక బెగ్గర్ లుక్ లో చూపిస్తున్నారు. కుబేర అంటే ధనాధిదేవత. శ్రీ వేంకటేశ్వరుడు వివాహం నిమిత్తము కుబేరుని దగ్గర ఎక్కువ మొత్తంలో ధనాన్ని అప్పుగా తీసుకుంటాడు. ఆ అప్పును ఇప్పటికీ తీరుస్తుంటాడని హిందువుల నమ్మకం. కైలాసం వద్దన ఉండే అలకానగరం కుబేరుని నివాస స్థలం.

అటువంటి టైటిల్ను సినిమాకి పెట్టి ధనుష్ ని కంప్లీట్ వేరే లుక్ లో చూపించడం అనేది కొద్దిపాటి ఆసక్తిని రేకిస్తుంది. ఇక ధనుష్ వెనకాల శివపార్వతిల ఫోటోలను చూపించడం కూడా ఒక క్యూరియాసిటీని పెంచుతుంది.

కుబేరుడు చిన్నతనం నుండి శివ భక్తి తత్పరుడు.ఒకసారి కుబేరుడు కఠోరమైన తపస్సు చేయటం. కొన్ని సంవత్సరాలు కేవలం ద్రవ పదార్ధాలను సేవించి, తరువాత కొన్ని సంవత్సరాలు కేవలం గాలి మాత్రమే భుజించి, అటు పిమ్మట గాలిని కూడా పీల్చకుండా వెయ్యి సంవత్సరాల పాటు చేసిన తర్వాత. ఆ తపస్సుకు మెచ్చిన పరమ శివుడు ప్రత్యక్షమయ్యి, తనని లోకపాలకునిగా, ధనాధ్యక్షునిగా ఉండే వరమిచ్చి అంతర్ధామనవుతాడు.

ఎక్కడ ఉండాలో తెలియని కుబేరుడు బ్రహ్మ కోసం తపస్సు చేయగా, ఆయన ప్రత్యక్షమయ్యి శంఖనిధి, పద్మనిధి, పుష్పక విమానం ప్రసాదించి, త్రికూట పర్వతం మీద, సముద్ర మధ్యభాగంలో ఉన్న లంకా పట్టణంలో పూర్వం రాక్షసులు ఉండేవారనీ, శ్రీహరి వలన భయంతో వారంతా పాతాళానికి పారిపోయారు కనుక అక్కడకి వెళ్ళి ఉండమనీ చెప్పి మాయమవుతాడు.

ఇక ఈ సినిమా పోస్టర్ చూస్తుంటే ధనుష్ కేవలం రోడ్లమీద ఉన్నట్లు అనిపిస్తుంది. ఏదేమైనా ఒక పోస్టర్లో మంచి డీటెయిల్ ఇచ్చి అద్భుతమైన టైటిల్ని పెట్టి సినిమా పైన క్యూరియాసిటీని పెంచేలా చేశాడు శేఖర్ కమ్ముల.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు