Nbk: నటసింహం మరో అవతారం

తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ముందు రచయితగా అడుగు పెట్టాడు బాబి. అయితే చాలా సినిమాలకు రచయితగా వర్క్ చేసిన బాబి పవర్ సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే బాబి మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకొని తనకంటూ దర్శకుడిగా ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రైటర్ గా వర్క్ చేసిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకి దర్శకుడుగా వర్క్ చేశాడు. అయితే ఆ సినిమా ఫెయిల్ అయినా కూడా ఒక దర్శకుడుగా బాబి ఆ సినిమాతో ఫెయిల్ కాలేదు.

ఆ తర్వాత ఎన్టీఆర్ తో జై లవకుశ అనే సినిమాను తెరకెక్కించాడు. అయితే ఎన్టీఆర్ లోని పరిపూర్ణమైన నటుడిని బయటికి తీసిన సినిమా అదే అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ ని మూడు పాత్రల్లో చూపించి ప్రేక్షకులను విపరీతంగా మెప్పించాడు బాబి. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బీభత్సమైన హిట్ ను సాధించింది.

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఏ దర్శకుడికి దక్కని అరుదైన అవకాశం, మరియు మంచి చాన్సులన్నీ బాబీకే దక్కాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే రెండవ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తీసిన తర్వాత మూడవ సినిమా ఎన్టీఆర్ తో తీయడం ఆ తర్వాత నాలుగువ సినిమాని మల్టీస్టారర్ చేయటం బాబికి దక్కిన అదృష్టం. నాగచైతన్య విక్టరీ వెంకటేష్ కలిసిన నటించిన వెంకీ మామ సినిమాకి దర్శకత్వం వహించాడు బాబి. ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఫలితాన్ని సాధించింది.

- Advertisement -

ఇక బాబీకి ఎనలేని కీర్తిని తీసుకొచ్చిన సినిమా వాల్తేరు వీరయ్య. మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్ రాబట్టింది. ఎప్పటినుంచో చిరంజీవిలో మిస్ అవుతున్న ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ని అద్భుతంగా బయటికి తీసి ప్రాపర్ గా పక్కా కమర్షియల్ సినిమాను అందించాడు బాబి.

అయితే బాబీ ప్రస్తుతం బాలకృష్ణతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ అలానే త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య సౌజన్య శ్రీనివాస్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకి ఇంకా టైటిల్ ని ఖరారు చేయలేదు. రీసెంట్గా ఈ సినిమా నుంచి మహాశివరాత్రి కానుకగా ఒక గ్లిమ్స్ వీడియోను రిలీజ్ చేశారు.

రిలీజ్ చేసిన గ్లిమ్స్ వీడియో అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. మామూలుగా బాలకృష్ణ బోయపాటి శీను కాంబినేషన్ మాత్రమే అద్భుతంగా వర్కౌట్ అవుతుంది అంటారు. కానీ ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత బోయపాటి శీను రేంజ్ లోనే బాబి కూడా దీన్ని ప్లాన్ చేశాడు అనేటట్లు చెప్పొచ్చు. ఒక దట్టమైన అడవిలో మంటల మధ్య రౌడీల పై బాలకృష్ణ దాడి చేయడం. దానికి సరిపడా డైలాగ్స్ ని పర్ఫెక్ట్ గా బాబి రాయటం. ఈ ఈ గ్లిమ్స్ మంచి హై ని తీసుకొస్తుంది. అయితే నక్కలపై ఎప్పుడు సింహం దాడి చేయదని, సింహం వేటాడుతుందని సెన్స్ లో వచ్చే డైలాగ్ బాలకృష్ణ ని ఒక రేంజ్ లో ఎలివేట్ చేసింది. దానితోపాటు బాలయ్య బాబు బ్రాండ్ ఆల్కహాలను కూడా రీవీల్ చేయటం కొత్తగా అనిపిస్తుంది.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు