Thamannah: అఘోరా గా మారిన తమన్నా.. వర్కౌట్ అయ్యేనా..?

వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న సమయంలో హీరోయిన్ హెబ్బా పటేల్ కెరియర్ ను ఒక్కసారిగా మలుపు తిప్పిన చిత్రం ఓదెల రైల్వే స్టేషన్.. ఈ చిత్రం రెండేళ్ల క్రితం డైరెక్ట్ గా ఓటీటీ లో విడుదలై ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్టర్ అశోక్ తేజ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మరొక డైరెక్టర్ సంపత్ నంది కథను అందించారు.. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యంలో.. క్రైం థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రంలో హెబ్బా పటేల్, పూజిత పొన్నాడ, వశిష్ట సింహ తదితర నటీనటులు సైతం నటించారు. ఈ సినిమాలో చాకలి పాత్రలో అద్భుతంగా నటించింది హెబ్బా పటేల్..

ఓదెల -2 :
దాదాపుగా ఏడాదిన్నర గ్యాప్ తర్వాత మళ్లీ మేకర్స్ ఈ చిత్రానికి సీక్వెల్ ని తెరకెక్కించబోతున్నామంటూ
. అది కూడా ఓదెల-2 గా రాబోతోందంటూ గడిచిన కొన్ని రోజుల క్రితం ప్రకటించారు.. అయితే ఈ సినిమా కథనంతో పాటు నిర్మాతగా కూడా డైరెక్టర్ సంపత్ నందినే వ్యవహరిస్తూ ఉండడం గమనార్హం.. అయితే ఈ చిత్రానికి దర్శకత్వం మాత్రం అశోక్ తేజనే చేస్తున్నారు. ఈ చిత్రం ఓపెనింగ్ మార్చి ఒకటిన జరిగింది.. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మేకర్స్ ఇదివరకే ప్రారంభించారు.. ఓదెల మొదటి భాగంలో హెబ్బా పటేల్ నటించగా..ఓదెల-2 భాగంలో హీరోయిన్ తమన్నాను ఎంపిక చేశారు..

ఓదెల -2 లో తమన్నా లుక్..
ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా తమన్నా కు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్.. ఇందులో కాశీ గంగా నది తీరాన తమన్నా నడుస్తూ ఉన్నటువంటి ఫోటోని సైతం షేర్ చేశారు.. అలాగే ఒక చేతిలో ఢమరుకం ..మరొక చేతిలో దండం పట్టుకుని తమన్నా అఘోరా గా కనిపిస్తోంది.. ఈ పోస్టర్ చూస్తూ ఉంటే శివశక్తిగా ఆమె నటిస్తున్నట్లు కనిపిస్తోంది.. ఓదెల-2 పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. మొదటి భాగాన్ని ఓటీటీ లో డైరెక్ట్గా రిలీజ్ చేయగా.. ఈసారి సీక్వెల్ థియేటర్లో పలు భాషలలో విడుదల చేయాలని మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు..

- Advertisement -

థ్రిల్లర్ జోనర్..
కాంతారా, విరూపాక్ష , మంగళవారం వంటి సూపర్ హిట్ చిత్రాలకు సంగీతాన్ని అందించిన అంజనీ శ్లోక నాథ్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నట్లు తెలుస్తోంది.. మొదటిసారి ఇలాంటి పాత్రలో తమన్నా నటిస్తూ ఉండడంతో అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.. ఇటీవల కాలంలో తమన్నా సక్సెస్ రేటు కూడా బాగానే పెరిగిపోయింది. మరి ఏ మేరకు ఈ సినిమాతో మెప్పిస్తుందో చూడాలి మరి..

తమన్నా ప్రేమాయణం..
.తమన్నా వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. ప్రముఖ బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ఈమె గత కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తోంది. అయితే గత ఏడాది న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా తన బాయ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తూ కెమెరా కంట పడింది. ఇక తర్వాత పలు రకాల వార్తలు రాగా వీటిపై నిజమేనని క్లారిటీ ఇచ్చింది. ఇక ఏడాది వివాహానికి సిద్ధమవుతోంది తమన్నా..

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు