‘Bhimaa’ Movie Review : ‘భీమా’ మూవీ రివ్యూ

గోపీచంద్ నుండి వచ్చిన లేటెస్ట్ మూవీ ‘భీమా’. ట్రైలర్ డిఫరెంట్ గా అనిపించింది. దీంతో కొద్దిపాటి అంచనాలు ఏర్పడ్డాయి. పైగా ఈరోజు మార్చి 8 శివరాత్రి. చాలా మందికి సెలవు కూడా ఉంది. పాజిటివ్ టాక్ వస్తే.. వీకెండ్ వరకు బాక్సాఫీస్ వద్ద సందడి చేసే అవకాశం ఈ సినిమాకి ఉంది. మరి ‘భీమా’ ఆ స్థాయిలో ఉందా లేదా అనేది తెలుసుకుందాం రండి :

మహేంద్రగిరి అనే ఊరు. అక్కడ తిరుగులేని ఓ గుండా భవాని (ముఖేష్ తివారి). పోలీసులని సైతం అతను లెక్కచేయడు.వారికెదురొస్తే చంపించేస్తాడు. అయితే అతనికి సంబంధించిన ఓ  ట్యాంకర్ ను చెక్ పోస్ట్ దాటిస్తూ ఉంటాడు. దాని జోలికి ఎవరైనా వెళ్తే వాళ్ళని హతమారుస్తూ ఉంటాడు. ఇలాంటి ఏరియాకి భీమా (గోపీచంద్) ఎస్సైగా ట్రాన్స్ఫర్ అయ్యి వస్తాడు. వచ్చిన వెంటనే భవానీ వద్ద పనిచేసే రౌడీలను చితగ్గొట్టి వార్నింగ్ ఇస్తాడు. మరోపక్క అతని దందాలని కూడా బంద్ చేయిస్తాడు. అయితే అనుకోకుండా భీమాచెక్ పోస్ట్ వద్ద దాటుతున్న విలన్ ట్యాంకర్ ను పట్టుకుంటాడు? అందులో విలన్ కి సంబంధించి ఏం రహస్యం ఉంది? హీరోయిన్లు విద్య (మాళవికా శర్మ) పారిజాతం (ప్రియా భవానీ శంకర్) ల పాత్రలు ఏంటి? అనేది మిగిలిన కథ

విశ్లేషణ :

- Advertisement -

కన్నడ దర్శకుడు ఎ.హర్ష టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తూ చేసిన సినిమా ఇది. అక్కడి జనాలు మనకంటే మాస్ గా ఉంటారు. కాబట్టి.. మనకి కాలం చెల్లిపోయిన కథలు కూడా అక్కడ సక్సెస్ అవుతాయి. అలాగే ప్రతి కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టి..ల మాదిరి ఉండరు అని ‘భీమా’ సినిమా మొదలైన 20 నిమిషాలకే అందరికీ ఓ క్లారిటీ వచ్చేస్తుంది. హీరో పోలీస్ గెటప్లో రావడమే విలన్ గ్యాంగ్ ను చితక్కొట్టేసి, అతనికి వార్నింగ్ ఇవ్వడం.. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో కామెడీ చేయడం లేకపోతే మిగిలిన పోలీసులకి క్లాస్..లు పీకడం వంటివి ఎన్ని సినిమాల్లో చూసి ఉంటాం. ఆ సీన్లు మళ్ళీ కళ్ళముందుకొస్తుంటే చిరాకు రాకుండా ఉంటుందా చెప్పండి. అయితే ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం బాగుంది. సెకండ్ హాఫ్ పై హోప్ ఇచ్చింది. కానీ సెకండ్ హాఫ్ లో మళ్ళీ సీనియర్ నరేష్ వచ్చి కుళ్లిపోయిన జోకులు వేస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. అలాగే గోపీచంద్ ఇంకో గెటప్ లో కనిపిస్తాడు. ఇది ఫ్లాష్ అనుకోవాలా లేక ప్రెజెంట్ లో జరుగుతుంది అనుకోవాలా? అనేది క్లైమాక్స్ వరకు క్లారిటీ రాలేదు. అన్నట్టు ఇంకో విషయం మళ్ళీ క్లైమాక్స్ ఆకట్టుకునే విధంగా ఉంది. రవి బస్రూర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్. 2 పాటలు కూడా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ కూడా నిర్మాణ విలువలను హైలెట్ చేసాయి అని చెప్పాలి.

నటీనటుల విషయానికి వస్తే …

గోపీచంద్ భీమా పాత్రలో మెప్పించాడు. అతని స్క్రీన్ ప్రెజెన్స్ తో ఓ పెద్ద సినిమా చూస్తున్న ఫీలింగ్ ను కలిగించాడు. అతని వరకు న్యాయం చేశాడు. డౌట్ లేదు. కానీ ఇలాంటి రొటీన్ కథలు ఇంకా చేస్తే ఎలా? రాంగ్ టైంలో వచ్చాయి అని మర్చిపోయి ‘ఒక్కడున్నాడు’ ‘సాహసం’  వంటి సినిమాలకి ఉన్న కల్ట్ ఫ్యాన్స్ ను అతను మర్చిపోయాడు. ఈ టైంలో ఇతనికి అలాంటి సినిమాలు వర్కౌట్ అవుతాయి. లేదు కమర్షియల్ మీటర్లో వెళ్ళాలి అనుకుంటే ‘గోలీమార్’ వంటి రోల్స్ అయినా చేయాలి. మరీ ఇలాంటివి చేస్తే గోపీచంద్ ను జనాలు మర్చిపోయే ప్రమాదం ఉంది. ఇక హీరోయిన్ మాళవిక శర్మ.. ని టీచర్ గా చూపించారు. కానీ సిల్క్ చీర, స్లీవ్ లెస్ జాకెట్లో ఆమెను చూపించి ఉపాధ్యాయురాలు పరువు తీసే విధంగా దర్శకుడు ఆమెను ప్రెజెంట్ చేయడం దారుణం. గౌతమ్ మీనన్ ‘ఘర్షణ’ లో ఆసిన్ ను ఎంత పద్దతిగా చెరలో చూపించాడు అనేది దర్శకులు గుర్తుంచుకోవాలి. ప్రియా భవానీ శంకర్ పాత్ర కూడా పెద్దగా ఇంపాక్ట్ చూపే విధంగా ఉండదు.వెన్నెల కిషోర్ కి మంచి పాత్ర దొరికింది. కానీ లాస్ట్ సీన్ కి అతన్ని కూడా  సేడ్ చేసేసారు.

ప్లస్ పాయింట్స్ :
గోపీచంద్
ప్రీ ఇంటర్వెల్ బ్లాక్
క్లైమాక్స్

మైనస్ పాయింట్స్ :
రొటీన్ కథ
సిల్లీ కామెడీ
డైరెక్షన్

మొత్తంగా ‘భీమా’ … బి,సి సెంటర్ ఆడియన్స్ కి బిలో యావరేజ్ టు యావరేజ్ అనే విధంగా అనిపించొచ్చు. మిగిలిన వాళ్ళకి కష్టమే.

రేటింగ్ :  2/5

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు