Odela2 : బ్లాక్ బస్టర్ సీక్వెల్ లో.. అలాంటి పాత్రలో తమన్నా?

టాలీవుడ్ లో లాక్ డౌన్ లో ఓటిటి లో రిలీజ్ అయిన సినిమా “ఓదెల రైల్వేస్టేషన్. సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా అప్పట్లో మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. అయితే ఈ సినిమాకి తాజాగా సీక్వెల్ వస్తుందని రీసెంట్ గా అనౌన్స్ మెంట్ జరిగిన విషయం తెలిసిందే. మొదటిభాగానికి కథ అందించిన ప్రముఖ దర్శకుడు సంపత్ నంది ఈ సీక్వెల్ కి కూడా కథ అందిస్తుండగా, “ఓదెల2” పేరుతొ సినిమా రూపొందుతున్నట్టు అనౌన్స్ చేసారు. ఇక ఈ సినిమా ఓపెనింగ్ ఏకంగా కాశి పుణ్యక్షేత్రంలో చేయడం విశేషం. ఇక ఓపెనింగ్ జరిపిన రోజు నుండే ఆల్మోస్ట్ షూటింగ్ కూడా మొదలయిందని సంపత్ నంది తెలియచేయడం జరిగింది.

నిర్మాతగా సంపత్ నంది..

అయితే ఈ ఓదెల2 సినిమాకు సంపత్ నంది నిర్మాత గా కూడా మారనున్నాడు. ఫస్ట్ మూవీకి కథ మాత్రమే అందించిన సంపత్ రెండో భాగానికి నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టాడు. అయితే గతంలో సంపత్ నంది గాలిపటం, లాంటి చిన్న చిత్రాలకు సహ నిర్మాతగా ఉన్నాడు. ప్పుడు ఓదెల2 సినిమాతో పూర్తి స్థాయి నిర్మాత కానున్నడని సమాచారం. ఇక సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న గాంజా శంకర్ స్క్రిప్ట్ డెవలప్ మెంట్ పనుల్లో ఉండగా, సంపత్ ఈ సినిమాను కూడా హ్యాండిల్ చేయనున్నాడు.

- Advertisement -

తమన్నా నాగ సాధువుగా..

ఇక ఓదెల2 సీక్వెల్ మూవీలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుందని, తనే మెయిన్ లీడ్ అని సంపత్ నంది తెలియచేసాడు. అయితే ఈ సినిమాలో కొంతమేర మైథలాజి టచ్ కూడా ఇవ్వనున్నట్టు మేకర్స్ ద్వారా తెలిసింది. పైగా ఆ పోస్టర్ లో కూడా తెలుస్తుంది. అయితే ఓదెల2 సినిమాలో తమన్నా ఓ వైవిధ్యమైన పవర్ ఫుల్ పాత్రలో నటిస్తుందని సమాచారం. భారతదేశంలో ఉన్న సాధువుల్లో అత్యంత శక్తివంతమైన సాధువులు నాగసాధువులు. శివభక్తులైన వీరు కేవలం కుంభమేళాలో మాత్రమే కనిపిస్తారు. మిగతా రోజుల్లో హిమాయలయాల్లోనే గడిపేస్తారు. అయితే తమన్నా ఈ సినిమాలో ఒక మహిళా నాగసాధువుగా కనిపించనుందట. అయితే నాగసాధువులు దిగంబరంగా ఉంటారు. మహిళా నాగసాధువులు ఏకవస్త్ర లో ఉంటారు.

ఇక ఫస్ట్ పార్ట్ కి దర్శకత్వం వహించిన అశోక్ తేజ నే ఈ సీక్వెల్ కి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. రెండో పార్ట్ మరింత ఉత్కంఠ గా థ్రిల్లింగ్ గా ఉండబోతుందని మేకర్స్ అనౌన్స్ చేసారు. మరి రచయిత సంపత్ నంది, దర్శకుడు అశోక్ తేజ్ సినిమాలో తమన్నా ని ఏ రేంజ్ లో చూపిస్తారో అని ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. బహుశా తమన్నా కి ఈ సినిమా లో పాత్ర కెరీర్ లో గుర్తుండి పోయే రోల్ కావచ్చు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు