Manjummel Boys : ప్రేమలు వెంటే మరో బ్లాక్ బస్టర్..

మలయాళంలో ఈ మధ్య వరుస బెట్టి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవుతున్నాయి. తెలుగు ఇండస్ట్రీలో నెలకో హిట్టు కొట్టడానికే తటపటాయిస్తుంటే, మలయాళంలో మాత్రం నెలకో హిట్టు కొడుతూ అక్కడి బాక్స్ ఆఫీస్ కళకళలాడుతుంది. అయితే అందులో కొన్ని సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఆల్రెడీ మమ్మూట్టి భ్రమయుగం సినిమా తెలుగులో రిలీజ్ చేయగా తెలుగు ప్రేక్షకులకి అంతగా కనెక్ట్ అవలేదు. కానీ ఈ వారం రిలీజ్ అవబోయే ‘ప్రేమలు’ సినిమా మాత్రం ఖచ్చితంగా తెలుగు ఆడియన్స్ ని మెప్పిస్తుందని అనిపిస్తుంది. సినిమా కూడా హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కడం వల్ల, రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ మెప్పించడం వల్ల ప్రేమలు మూవీ పై ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మార్చి 8న రిలీజ్ అవుతుంది ఈ సినిమా.

మార్చి15న మంజుమ్మేల్ బాయ్స్..

మలయాళం లో రీసెంట్ గా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాల్లో మంజుమ్మేల్ బాయ్స్ కూడా ఒకటి. తమిళనాడు లో కొడైకెనాల్ లో జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా మలయాళంలో దున్నేస్తుంది. అయితే లేటెస్ట్ గా ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇక ఈ సర్వైవల్ థ్రిల్లర్‌ మూవీకి మలయాళం దర్శకుడు చిదంబరం దర్శకత్వం వహించాడు. సౌబిన్ షాహీర్, శ్రీనాథ్ భాసి, బాలు వర్గీస్, గణపతి, లాల్ జూనియర్, చంతు సలీంకుమార్, అభిరామ్ రాధాకృష్ణన్, దీపక్ పరంబోల్, ఖలీద్ రెహమాన్, అరుణ్ కురియన్, విష్ణు రఘు ఈ చిత్రంలో స్నేహితులుగా ప్రధాన పాత్రలు పోషించారు. ఇక మంజుమ్మేల్ బాయ్స్ సినిమాలో టెక్నీకల్ గా షైజు ఖలీద్ సినిమాటోగ్రఫీ ప్లస్ పాయింట్ గా నిలవగా, ఈ చిత్రం విజువల్స్‌ పరంగా కూడా అద్భుతంగా ఉంది. తక్కువ ఖర్చుతో మేకర్స్ క్వాలిటీతో తేచి దిద్దారు. ఇక ఈ సినిమా ఎడిటింగ్ బాగుంది. ఎమోషనల్‌, టెన్షన్‌ సన్నివేశాల్లో నేపథ్య సంగీతంతో సుశీన్‌ శ్యామ్‌ ఆకట్టుకున్నాడు.

- Advertisement -

అప్పుడు ప్రేమలు.. ఇప్పుడు మంజుమ్మేల్ బాయ్స్..

టాలీవుడ్ లో పలానా ఇండస్ట్రీ లో సూపర్ హిట్ అయిన సినిమా తెలుగులో డబ్ అవడం మామూలే. అయితే వరుస మలయాళం సినిమాలు తెలుగులో డబ్ అవడం, ఈ మధ్య కాలంలో కాలంలో చాలా అరుదైన విషయం అని చెప్పాలి. అది కూడా మలయాళం ఇండస్ట్రీ నుండి వారానికో సినిమా డబ్ అవడం యాధృచ్చికమే అయినా, రిలీజ్ కాబోతున్న సినిమాల కోసం మాత్రం తెలుగు ఆడియన్స్ కూడా బాగానే వెయిట్ చేస్తున్నారని తెలుస్తుంది. ముందుగా భ్రమయుగం డబ్ అయి రిలీజ్ కాగా, ఈ సినిమా ఆల్రెడీ ఒరిజినల్ వెర్షన్ చాలా మంది చూడడం వల్ల పెద్దగా ప్రభావం చూపలేదు. ఇక మార్చి 8న ప్రేమలు రిలీజ్ అవుతుంది. లవ్ స్టోరీ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా విజయం పై చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఇక ఈ సినిమాని ఎస్ఎస్ రాజమౌళి కొడుకు కార్తికేయ రిలీజ్ చేస్తున్నాడని తెలిసిందే. అలాగే ఇప్ప్పుడు మార్చి15న రిలీజ్ అవవోతున్న మంజుమ్మేల్ బాయ్స్ కూడా తెలుగులో మంచి సక్సెస్ సాధిస్తుందని డిస్ట్రిబ్యూటర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు