GeethaArts : ఎన్టీఆర్ బావమరిది హీరోగా మరో సినిమా?

ఎన్టీఆర్ బావమరిది నితిన్ హీరోగా మళ్ళీ..!

టాలీవుడ్ లో లాస్ట్ ఇయర్ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయిన సినిమాల్లో “మ్యాడ్” సినిమా కూడా ఒకటి. ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమా మౌత్ టాక్ ఎఫెక్ట్ తో థియేటర్లలో బాగా ఆడింది. ఇక ఈ సినిమాలో మెయిన్ లీడ్ గా హీరోలుగా నార్నె నితిన్, సంగీత్ శోభన్ నటించారు. అయితే ఈ సినిమా తర్వాత నార్నెనితిన్ కి మరో బంపర్ ఆఫర్ వచ్చింది. టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన గీతా ఆర్ట్స్ నార్నె నితిన్ తో సినిమా తీయడానికి రెడీ అయింది. అయితే లేటెస్ట్ గా గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఓపెనింగ్స్ కూడా జరుపుకుంది.

గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ..
ఇక గీతా ఆర్ట్స్ బ్యానర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెద్దా చిన్నా అన్న తేడా లేకుండా భారీ సినిమాలు నిర్మిస్తూ సోషల్ మీడియాలో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది. ప్రస్తుతం నాగ చైతన్య తో తండేల్ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు మేకర్స్. త్వరలోనే మరో పాన్ ఇండియా మూవీ ని కూడా అనౌన్స్ చేస్తారు మేకర్స్. ఇదిలా ఉండగా తాజాగా ఓ చిన్న సినిమాను గీతా ఆర్ట్స్ నుండి అనౌన్స్ చేయడం జరిగింది. మ్యాడ్ సినిమాతో నటుడుగా మంచి మార్కులు కొట్టేసిన నార్నె నితిన్ ఈ సినిమాలో నటిస్తున్నారని తెలిసింది. ఇక నార్నె నితిన్ స్వయానా జూనియర్ ఎన్టీఆర్ కి బావమరిది, కాగా లక్ష్మి ప్రణతి తమ్ముడు. తాజాగా పూజా కార్యక్రమాలతో సినిమాను లాంచ్ చేయడం జరిగింది.

- Advertisement -

మనల్ని ఎవడ్రా ఆపేది?

ఇక అల్లు అరవింద్ చేతుల మీదుగా ఓపెనింగ్స్ జరుపుకున్న ఈ సినిమాకు టైటిల్ ఇంకా ఫిక్స్ చేయలేదు. నార్నే నితిన్, ఇంకా నయన సారిక హీరో హీరోయిన్లుగా నటించబోయే ఈ సినిమా యొక్క టైటిల్ ని త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. అయితే మాకందిన సమాచారం ప్రకారం ఈ సినిమా యొక్క టైటిల్ ‘మనల్ని ఎవడ్రా ఆపేది’? అనే టైటిల్ ని కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది. రేపు జరిగే అనౌన్స్ మెంట్స్ లో టైటిల్ ని రివీల్ చేస్తారు మేకర్స్. ఇక ఈ మధ్య వారసత్వం తో ఎంట్రీ ఇచ్చినప్పటికీ తమ టాలెంట్ తో నిరూపించుకున్నాకే మూవీ ఛాన్సులు దక్కించుకుంటున్నారు. మరి ఈ సినిమాతో నార్నె నితిన్ ఏ మేరకు జనాల్ని ఆకర్షిస్తాడో చూడాలి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు