Odela2 : ఓటిటి బొమ్మకి సీక్వెల్ రెడీ..

లాక్ డౌన్ సమయంలో థియేటర్లు మూతబడి ఉన్న కారణంగా ఓటిటి లు ఊపందుకున్నాయన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టాలీవుడ్ ఆడియన్స్ కి ఆహా ఓటిటి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దాదాపు రెండేళ్ల పాటు చాలా చిన్న సినిమాలు ఓటిటి లోనే రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యాయి. ఆలా ఓటిటి లో సైలెంట్ గా వచ్చి బ్లాక్ బస్టర్ అయిన సినిమా “ఓదెల రైల్వేస్టేషన్”. సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా అప్పట్లో సాలిడ్ వ్యూయర్ షిప్ ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాకు టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కథని అందించడం జరిగింది. తాజాగా ఈ సినిమా కి సీక్వెల్ సినిమా అనౌన్స్ అయింది.

ఓదెల కథ..

అప్పట్లో సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా ఓటిటి లో మంచి ఆదరణ దక్కించుకోగా, ఈ సినిమాలో హెబ్బా పటేల్ తన పెర్ఫార్మన్స్ తో చాలా ఇంప్రెస్స్ చేసిందని చెప్పొచ్చు. ఒకసారి ఈ కథ గురించి గుర్తు చేసుకుంటే.. సినిమా మొదలవుతూనే అనుదీప్ అనే కుర్రాడు అప్పుడే ఐపీఎస్‌గా ఓదెల ఊరికి పోలీస్ ట్రైనింగ్ మూడు నెలల కోసం వస్తాడు. అయితే ఈ మూడు నెలల్లో ఊరిలో వరుసగా హత్యలు జరుగుతుంటాయి.అయితే ఆ హత్యలు విచిత్రంగా ఉంటాయి. ఊర్లో పెళ్లి జరగడం, శోభనం అయిన తెల్లారి పెళ్లి కూతురి మీద అత్యాచారం జరిపి, హత్య చేస్తుంటాడు ఓ సైకో. ఆ సైకోను పట్టుకునేందుకు అనుదీప్ చేసిన ప్రయత్నాలు ఏంటి? ఈ నేపథ్యంలో ఆ ఊర్లోని రాధ ఆమె మొగుడు తిరుపతి ల కథేంటి? అనుదీప్ కోసం తన ప్రియురాలు స్పూర్తి తీసుకున్న డేరింగ్ స్టెప్ ఏంటి? చివరకు సైకోను పట్టుకోగలిగారా లేదా అన్నది కథ. ఈ క్రమంలో సినిమా చూసిన వారందరికీ క్లైమాక్ ట్విస్ట్ మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఆ హత్యలు చేస్తుంది తిరుపతి అని తెలుసుకుని, అతడ్ని ఆపబోతుంది. అతను వినకపోయే సరికి అతడ్ని నరికేస్తుంది. ఆ సీన్ లో అతడి తల తీసుకుని పోలీస్ స్టేషన్ కి వచ్చే సీన్ హైలెట్. అక్కడితో ఫస్ట్ పార్ట్ ముగుస్తుంది.

- Advertisement -

సీక్వెల్ అనౌన్స్ మెంట్..

అయితే ఓదెల రైల్వేస్టేయిన్ కి తాజాగా సీక్వెల్ అనౌన్స్ మెంట్ జరిగింది. మొదటిభాగానికి కథ అందించిన సంపత్ నంది ఈ సీక్వెల్ కి కూడా కథ అందిస్తుండగా, ఓదెల2 అనే టైటిల్ తో సినిమా రూపొందుతున్నట్టు అనౌన్స్ చేసారు. అయితే ఈ సినిమాకు సంపత్ నంది ఈ సారి నిర్మాత గా కూడా మారనున్నారు. ఫస్ట్ మూవీకి కథ మాత్రమే అందించిన సంపత్ రెండో భాగానికి నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టాడు. ఇక ఈ సీక్వెల్ లో తమన్నా హీరోయిన్ గా నటిస్తుందని అనౌన్స్ చేయగా, ఫస్ట్ షెడ్యూల్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఓదెల2 షూటింగ్ కాశి లో ఈరోజే మొదలవనుందని చెప్పడం జరిగింది. ఈ సినిమాకి కొంతమేర మైథలాజి టచ్ కూడా ఇవ్వనున్నారు మేకర్స్. ఇక ఫస్ట్ పార్ట్ కి దర్శకత్వం వహించిన అశోక్ తేజ నే ఈ సీక్వెల్ కి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. రెండో పార్ట్ మరింత ఉత్కంఠ గా థ్రిల్లింగ్ గా ఉండబోతుందని మేకర్స్ అనౌన్స్ చేసారు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు