Sampath nandi : నిర్మాతగా సంపత్ నంది.. మరి తేజ్ మూవీ?

టాలీవుడ్ లో మాస్ చిత్రాల దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న సంపత్ నంది గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఏమైంది ఈవేళ అనే చిన్న సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ దర్శకుడు ఫస్ట్ సినిమా యావరేజ్ గా ఆడినా, ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో రచ్చ మూవీ ఛాన్స్ అందుకుని, రచ్చ రచ్చ చేసాడు. ఈ సినిమా చూడ్డానికి యావరేజ్ గా అనిపించినా, అప్పట్లో భారీ బ్లాక్ బస్టర్ అయింది. ఇక ఆ తర్వాత బెంగాల్ టైగర్, గౌతమ్ నంద, సీటిమార్ సినిమాలతో ఆకట్టుకున్నాడు. ఇవే గాక మధ్యలో పలు చిన్న చిత్రాలకు రైటర్ గా కూడా చేసాడు సంపత్ నంది. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ తో “గాంజా శంకర్” అనే సినిమా చేస్తున్నాడు.

గాంజా శంకర్ షూటింగ్..

గాంజా శంకర్ షూటింగ్ గత ఆరు నెలల కిందే స్టార్ట్ అయినా, కొన్ని కారణాల వల్ల ఈ సినిమా రెగ్యులర్ షూట్ జరుపుకోవడం లేదు. దాంతో ఈ సినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. ఇదీ కొన్ని రోజుల కింద సంపత్ నంది సాయి తేజ్ కాంబో లో వస్తున్న గాంజా శంకర్ మూవీ టైటిల్ ను మార్చాలంటూ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు చిత్ర బృందానికి నోటీసులు జారీ చేయడంతో, ఆ మధ్య మరోసారి ఈ సినిమా వార్తల్లో నిలిచింది. దాంతో సినిమా సగం కూడా పూర్తికాకుండా ఆటకెక్కిందని పలువురు భావించారు. అయితే చిత్ర యూనిట్ మాత్రం తమ సినిమా ఆగిపోలేదని, స్కిప్ట్ డెవలప్మెంట్ కోసం కాస్త గ్యాప్ ఇచ్చామని క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పుడు మరో తాజా వార్త తో గాంజా శంకర్ షూటింగ్ మళ్ళీ ఆగిపోయిందని వార్తలు వస్తున్నాయి.

- Advertisement -

నిర్మాతగా మారిన దర్శకుడు..

కమర్షియల్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది నిర్మాతగా ఓ కొత్త సినిమా తీయనున్నట్టు లేటెస్ట్ గా ఓ టాక్ నడుస్తుంది. అంతే కాదు సంపత్ నంది నిర్మించబోయే చిత్రం ఒక మంచి మిస్టీరియస్ అండ్ మైథలాజికల్ టచ్ కథ నేపథ్యంతో వస్తున్నాడట. అయితే సినిమా దర్శకుడి గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

తమన్నా తో నాలుగోసారి..

ఇక ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా కీలక పాత్ర లో నటించనుందని సమాచారం. ఇక తామన్నాయే ఎందుకంటే.. సంపంత్ నంది దర్శకత్వం వహించిన సినిమాల్లో తమన్నా ఇంతకు ముందే మూడు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. దాదాపు పదమూడేళ్ళుగా తమన్నా తో సంపత్ నంది ఫ్రెండ్షిప్ ఉంది. ఆ చనువుతో తక్కువ రెమ్యూనరేషన్ కే తమన్నా తో సినిమా చేయించుకుంటున్నాడని సమాచారం. ఇక ఈ సినిమాకు దర్శకుడు ఎవరూ అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక సంపత్ నంది ఇంతకు ముందు గాలిపటం, పేపర్ బాయ్ లాంటి చిన్న సినిమాలకు సహ నిర్మాతగా ఉన్నాడు. ఇప్పుడు పూర్తి స్థాయి నిర్మాతగా సినిమా చేయబోతున్నాడని సమాచారం. అయితే గాంజా శంకర్ పరిస్థితేంటి? మళ్ళి షూటింగ్ ఆగిపోయిందా? అందుకే సంపత్ నంది వేరే సినిమా పనుల్లో ఉన్నాడా అని కొందరు నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే చిత్ర యూనిట్ నుండి మాత్రం సినిమా షూటింగ్ జరుగుతూనే ఉందని సమాచారం. ఇక మహాశివరాత్రి సందర్బంగా మూవీ నుండి అప్డేట్ రావచ్చు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు