Prabhas: స్పిరిట్ మూవీ నుంచి ప్రభాస్ క్యారెక్టర్ రివీల్ చేసిన సందీప్ రెడ్డి వంగా..!!

టాలీవుడ్లో అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ డైరెక్టర్ గా పేరుపొందిన సందీప్ రెడ్డి వంగా.. బాలీవుడ్ లో కూడా అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ సినిమాని తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నారు.. ఇటీవలే యానిమల్ సినిమాతో స్టార్ డైరెక్టర్ లిస్టులో చేరిపోయారు సందీప్ రెడ్డి.. యానిమల్ సినిమా గురించి ఎంతమంది ఎన్ని విధాలుగా విమర్శలు చేసినా వారందరికీ తనదైన స్టైల్ లో కౌంటర్ ఇస్తూ ఉంటారు.. ఎలాంటి ఈవెంట్ కి గెస్ట్ గా వెళ్లినీ ఈ డైరెక్టర్ ఇటీవలే గామి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి గెస్ట్ గా వెళ్లడం జరిగింది.

గామి ట్రైలర్ లాంచ్ లో సందీప్ రెడ్డి:
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గామి సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తర్వాత బయటకు రాగానే అందరూ ఒకే ప్రశ్నను అడిగేశారు.. ముఖ్యంగా ప్రభాస్ తో తెరకెక్కిస్తున్న స్పిరిట్ సినిమా ఎప్పుడు మొదలవుతుందని కొంతమంది మీడియా వారు ప్రశ్నించగా.. అందుకు సమాధానంగా సందీప్ ఇలా మాట్లాడుతూ.. ముందుగా గామి ట్రైలర్ చాలా బాగుంది.. ఆరేళ్లపాటు ఒకే సినిమా కోసం అంకితం అవడం అనేది అది మామూలు విషయం కాదు.. యాక్టర్స్, డైరెక్టర్స్, నిర్మాతలకు చాలా ఓపిక ఉంటేనే ఇది సాధ్యమవుతుందని వెల్లడించారు.

విశ్వక్ సేన్ పై కామెంట్స్:
హీరో విశ్వక్ సేన్ గురించి మాట్లాడుతూ..మేకప్ అందుబాటులో లేని సమయాలలో కూడా హీరో విశ్వక్ స్వయంగా మేకప్ వేసుకున్నారు.. అతని డెడికేషన్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అంటూ వెల్లడించారు.. అలాగే ఈ సినిమా ట్రైలర్ చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తోందని థియేటర్లో చూసేటప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుందో అలా వస్తుందని చాలా డిఫరెంట్ మూవీ అని తెలిపారు. ఈ సినిమా తప్పకుండా మంచి సక్సెస్ అవ్వాలని ఈ సినిమా కథ చాలా డిఫరెంట్ గా ఉందంటూ టీమ్ అందరికీ గుడ్ లక్ చెప్పారు..

- Advertisement -

స్పిరిట్ మూవీ పై సందీప్ కామెంట్స్:
ఇక ప్రభాస్ తో కలిసి స్పిరిట్ సినిమా గురించి చెప్పాలి అంటే.. ఈ ఏడాది చివరిలో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని తెలిపారు..స్పిరిట్ సినిమా పాన్ ఇండియా ఫిలిం అని.. ఈ సినిమా పనులలో చాలా బిజీగా ఉన్నామని.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా చాలా వేగంగానే జరుగుతున్నాయని తెలిపారు..

స్పిరిట్ లో ప్రభాస్ లుక్ రివీల్:
ఈ సినిమా హర్రర్ మూవీ కాదని ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ కథలో ప్రభాస్ సరికొత్తగా కనిపించబోతున్నారని వెల్లడించారు.. మొదటిసారి ప్రభాస్ ఖాకీ దుస్తులలో కనిపించబోతున్నారని అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.. వాస్తవానికి స్పిరిట్ సినిమా అనౌన్స్ చేసి ఇప్పటికి ఎన్నో నెలలు గడిచినా ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.. తాజాగా సందీప్ రెడ్డి వంగా చేసిన కామెంట్స్ అభిమానులను ఫుల్ ఖుషి అయ్యేలా చేస్తున్నాయి. మొత్తానికి అయితే ప్రభాస్ సరికొత్త గెటప్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు