Pushpa the rule : టైంకి దింపేందుకు ఓవర్ టైం డ్యూటీ చేస్తున్న మేకర్స్..

టాలీవుడ్ లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ ప్రాజెక్టులలో పుష్ప ది రూల్ కూడా ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాకి రెండో భాగంగా తెరకెక్కుతున్న పుష్ప 2కి పాన్ ఇండియా వైడ్ గా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే గత మూడేళ్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇంకా జరుగుతూనే ఉంది. అయితే ఈ సినిమాని ఆగస్టు 15న రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇంతకుముందు ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ షూటింగ్ విషయంలో ఫ్యాన్స్ మాత్రం ఇప్పటికీ అనుమానంగానే ఉన్నారు ఎందుకంటే సుకుమార్ గాని అల్లు అర్జున్ గాని షూటింగ్ ల కంటే బయట ఈవెంట్స్ కి రెగ్యులర్ గా హాజరవుతూ ఉన్నారు. ఇలాంటి సమయంలో సినిమా షూటింగ్ రెగ్యులర్ గా జరుగుతుందా లేదా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. అయితే తాజాగా మేకర్స్ నుండి తాజాగా షూటింగ్ గురించి సమాచారం వచ్చింది.

ఓవర్ టైం కూడా..
పుష్ప ది రూల్ కి సంబంధించి నటీనటులతో సహా టెక్నికల్ టీమ్ చాలా కష్టపడుతున్నారట. ఏది ఏమైనా ఆగష్టు 15కి సినిమాని తీసుకురావాలనే టార్గెట్ తో మేకర్స్ పనిచేస్తున్నారని సమాచారం. ఈ సారి రిలీజ్ డేట్ ని అస్సలు మిస్ అవకూడదని టెక్నికల్ టీం ఫిక్స్ అయ్యి, మూవీ మేకర్స్ షూట్ రెండు యూనిట్స్ పెట్టి, ప్రతి రోజు ఓవర్ టైం కూడా చేస్తున్నారట. ఇక మేకర్స్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం ఈ సినిమా ఈ సినిమాలో కొన్ని సీన్లు తీసేసి, మళ్ళీ రీ షూట్ చేస్తున్నారట. ఎందుకంటే ఆ మధ్య ఈ సినిమాలో కీలక పాత్రలో హీరో అసిస్టెంట్ గా నటిస్తున్న జగదీశ్ ఓ కేసులో అనూహ్యంగా అరెస్ట్ కావడం వల్ల సినిమాకి రీ షూట్ తప్పలేదు. పైగా అతడ్ని బెయిల్ పై రిలీజ్ చేయించడానికి మేకర్స్ చాలా ట్రై చేసారని ఆ మధ్య వార్తలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. కానీ అవేమి ఫలించక పోవడంతో చిత్ర యూనిట్ ఇతర నటీనటులతో రీ షూట్ చేస్తున్నారు.

ఇక నుండి ప్రమోషన్స్..
పుష్ప ది రూల్ కోసం దర్శకుడు సుకుమార్ ఇప్పటినుండే ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలనీ చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు పుష్ప 2 నుండి ఫస్ట్ లుక్ పోస్టర్, చిన్న ఇంట్రో టీజర్ తప్ప మరేమి రాలేదు. అయితే ఇప్పటినుండి ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తూ, రిలీజ్ టైం వరకూ పీక్స్ కి తీసుకువెళ్లాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. లాస్ట్ ఇయర్ సినిమాకి ఒక్క స్టిల్ తో ఓ రేంజ్ హైప్ పెంచినట్టు, ఇకపై ప్రతి నెలలో రెండు సాలిడ్ పోస్టర్ లతో సినిమాపై బజ్ పెంచడానికి ట్రై చేస్తారట. ఇక అల్లు అర్జున్ బర్త్ డే కి మరో టీజర్ ని వదులుతూ, అప్పటి నుండి సినిమాలో ఒక్కో సాంగ్ రిలీజ్ చేస్తారని టాక్. అయితే మూవీ మేకర్స్ కన్ను మాత్రం ముందు నుండి నార్త్ పైనే ఉంది. అప్పట్లో పుష్ప కి హిందీలో ప్రమోట్ చేయకపోయినా ఏ రేంజ్ లో వసూళ్లు సాధించిందో తెలిసిందే. ఇక ఇప్పుడు పుష్ప ది రూల్ తో నార్త్ నుండే 500 కోట్లు కొట్టాలని మేకర్స్ భావిస్తున్నారు. అందుకే ముందుగా నార్త్ నుండే సినిమా ప్రమోషన్లు మొదలు పెట్టనున్నారట.

- Advertisement -

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు