Pushpa 2: పుష్ప 2 నుంచి మరో లీక్.. సినిమా మొత్తం లీక్ అయ్యేలా ఉందే..!

Pushpa 2

టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం పుష్ప.. ఈ చిత్రం అల్లు అర్జున్ కి జాతీయ అవార్డుని తెచ్చిపెట్టేలా చేసింది. ముఖ్యంగా ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు సుకుమార్. ఈ సినిమా సీక్వెల్ గా వస్తున్న పుష్ప ది రూల్ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుతున్నారు. ఈ సినిమా రూ.1000 కోట్ల మార్క్ టార్గెట్ తో బరిలోకి దించబోతున్నారు. ఇప్పటివరకు పోస్టర్లు, గ్లింప్స్ తోనే భారీగా అంచనాలను పెంచేసింది చిత్ర బృందం.

అప్పుడప్పుడు ఈ చిత్రానికి సంబంధించి కొన్ని సన్నివేశాలు, ఫోటోలు కూడా సోషల్ మీడియాలో లీకై వైరల్ గా మారుతూ ఉంటాయి. ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ చేయడానికి చిత్ర బృందం పక్కా ప్లాన్ తోనే ముందుకు వెళ్తోంది. పుష్ప-2 సినిమా పోస్ట్ పోన్ చేయకుండా ఉండేందుకు రెండు మూడు యూనిట్స్ ను పెట్టి మరీ సినిమా షూటింగ్ ని పూర్తి చేసే పనిలో పడ్డారు. డైరెక్టర్ సుకుమార్ 48 రోజులపాటు గంగమ్మ జాతర ఎపిసోడ్ ను కూడా షూట్ చేసినట్లు తెలుస్తోంది.

దాదాపుగా 12 నిమిషాల పాటు గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఈ ఎపిసోడ్ ఉండబోతోందని సుకుమార్ సన్నిహితుల వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ షెడ్యూల్ షూటింగ్ స్పాట్ నుంచి అల్లు అర్జున్ చీర కట్టుకున్న ఒక ఫోటో కూడా లీక్ అయ్యి వైరల్ గా మారింది. ఈ విషయం పైన సుకుమార్ చాలా సీరియస్ అయ్యాడట.. చీర కట్టుకొని కుర్చీలో కూర్చొని ఉన్న అల్లు అర్జున్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అలాగే జతరా టైంలోనే కాళ్లకు పారాణి పెట్టుకుని అల్లు అర్జున్ ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ప్రత్యేక్షమయ్యాయి. వీటితో సినిమా ఎలా ఉండబోతుందని అభిమానులు కూడా ఒక అంచనాకి వచ్చేసారు. అయితే ఇలా లీకులు రావడం వల్ల సినిమాపై ఆసక్తి కూడా తగ్గిపోతుందని అభిమానులు చెబుతున్నారు.

- Advertisement -

డైరెక్టర్ సుకుమార్ అండ్ టీమ్ పుష్ప-2 సినిమా నుండి లీకులు కాకుండా ఎంత జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఇప్పుడు మరొక లీక్ బయటికి రావడం జరిగింది. లేటెస్ట్ గా వచ్చిన ఈ లీక్ లో రావు రమేష్ రాజకీయ పార్టీకి సంబంధించిన ఒక పోస్టర్ వైరల్ గా మారుతోంది.. పుష్ప సినిమాలో ఎంపీ భూమారెడ్డి సిద్ధప్ప నాయుడు పాత్రలో కనిపించిన రావు రమేష్.. ఎర్రచందనం సిండికేట్ కి హెడ్గా ఉంటారు.. ఇప్పుడు ఆ పాత్రలకు కంటిన్యూగా షూటింగ్ జరుగుతూ ఉండగా.. ఆ షూటింగ్స్ పార్ట్ నుంచి రావు రమేష్ ప్రజా చైతన్య పార్టీ అనే ఫ్లెక్సీలు కూడా వైరల్ గా మారుతున్నాయి.. ఈ లీకులన్నీ కూడా రాకుండా ఆపాలని అల్లు అర్జున్ అభిమానులైతే సుకుమారుకి రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి చిత్ర బృందం ఇకనైనా గట్టి భద్రత ఏర్పాటు చేస్తుందేమో చూడాలి.

Another leak from the shooting of Pushpa-2

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు