Jr NTR Movie: WAR2 డైరెక్టర్‌తో ఎన్టీఆర్ వార్

Jr NTR Movie

ఆర్ఆర్ఆర్ సినిమా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ను గ్లోబల్ స్టార్స్‌గా మార్చింది.
ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీకే పరిమితం అయిన ఈ స్టార్ హీరోలను అంతర్జాతీయ స్టేజ్‌పైన నిలబెట్టేలా చేసింది.

కానీ, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఆర్ఆర్ఆర్ సినిమా ఓ పీడకల. చాలా మంచి పాత్ర అయినా, మంచి గుర్తింపు వచ్చినా, రామ్ చరణ్ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉండటం, తారక్‌ను డామినేట్ చేసేలా ఉండటం అనేవి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను చాలా ఇబ్బంది పెట్టాయి. ఈ సినిమాతో తారక్‌ను, ఆయన ఫ్యాన్స్‌ను ఇతర హీరోల ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేయడం ఈ మధ్య కాలంలో మనం చూశాం. ఇలాంటి పరిస్థితిలు మళ్లీ రావొద్దని జూనియర్ ఎన్టీఆర్ చూస్తున్నారట. కానీ, అచ్చం అలాంటి సినిమా ఆఫరే వచ్చింది ఆయనకు.

అదే బాలీవుడ్‌లో YRF స్పై యూనివర్స్‌లో భాగంగా వస్తున్న WAR 2. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అంతే కాదు… ఎన్టీఆర్ పాత్ర… బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ను ఢీ కొట్టేలా ఉంటుందట. ఈ పాత్రకు సంబంధించి ఇప్పటికే తారక్ పై లుక్ టెస్ట్ షూట్ కూడా జరిగిపోయింది.

- Advertisement -

అయితే… ఈ సినిమాలో కూడా తారక్ పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదట. ఎన్టీఆర్ పాత్రను హృతిక్ పాత్ర పూర్తిగా డామినేట్ చేసేలా ఉంటుందట. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాతో సపోర్టింగ్ హీరో అంటూ ట్యాగ్ తెచ్చుకుని ట్రోల్స్ ఎదుర్కొన్న తారక్ ఇప్పుడు… WAR 2 విషయంలో కూడా అలా జరగకూడదని అనుకుంటున్నారట. అందుకు సినిమాలో భారీగా మార్పులు చేయాలని, తన పాత్రకు ఇంపార్టెన్స్ క్రియేట్ చేయాలని డైరెక్టర్ ఆయన్ ముఖర్జీని డిమాండ్ చేస్తున్నారట. అంతే కాదు… హృతిక్ రోషన్‌ నుంచి డామినేషన్ వచ్చే ప్రతీ సీన్‌ను మార్చాలని డైరెక్టర్‌తో తారక్ పెద్ద వార్ చేస్తున్నారట.

అయితే, స్టోరీలో మార్పులు చేయడానికి డైరెక్టర్ ఆయన్ ముఖర్జీ సుముఖంగా లేడని సమాచారం. హీరో… విలన్ ఎలా ఉండాలో… అలాగే తన స్క్రిప్ట్ ఉందని, ఇప్పుడు తారక్ చెబితే తన స్క్రిప్ట్ మార్చే ప్రసక్తే లేదని ఆయన్ ముఖర్జీ తన సన్నిహితుల దగ్గర అంటున్నారని టాక్.

ఇది బయటి వచ్చిన తర్వాత నెటిజన్లు… “WAR 2 సినిమా వచ్చిన తర్వాత హృతిక్ – తారక్ మధ్య వార్ చూస్తామని అనుకున్నాం… కానీ, రిలీజ్ కు ముందే డైరెక్టర్ ఆయన్ ముఖర్జి – జూనియర్ ఎన్టీఆర్ మధ్య వార్ చూస్తున్నాము” అంటూ కామెంట్ చేస్తున్నారు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు