Kollywood: ఈ కోలీవుడ్ స్టార్స్ ఆస్తులు విలువ ఎంతో తెలుసా..?

Kollywood

ప్రస్తుతం సినీ పరిశ్రమలో పాన్ ఇండియా హవా కొనసాగుతున్న నేపథ్యంలో కోలీవుడ్ స్టార్ హీరోలు కూడా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. ఈ నేపథ్యంలోనే వారి తీసుకునే పారితోషకం కూడా పెరిగిపోతూ.. వారి ఆస్తులు కూడా బాగా పెరిగిపోతున్నాయి.. ఈ నేపథ్యంలోనే కోలీవుడ్లో అత్యధిక ధనవంత హీరో ఎవరు? మిగిలిన హీరోల ఆస్తులు ఏ విధంగా ఉన్నాయి? అనే విషయాలను తెలుసుకోవడానికి అభిమానుల సైతం ఆసక్తి చూపిస్తున్నారు.. మరి ఎవరి ఆస్తి ఎంత ఉందో? ఇప్పుడు చూద్దాం..

కోలీవుడ్ లో సూపర్ స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్న కమల్ హాసన్ , రజినీకాంత్ , అజిత్, విజయ్ దళపతి ఇలా వీరంతా కూడా ఒక్కో సినిమాకు సుమారుగా రూ. 100 కోట్లకు పైగా పారితోషకం తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కోలీవుడ్ చిత్రం పరిశ్రమలో అత్యంత ధనవంతుడు ఎవరనే సమాచారం ఇంటర్నెట్లో అందరినీ ఆకర్షిస్తోంది.. ప్రస్తుతం కమలహాసన్ ఆస్తి విలువ రూ.450 కోట్లు ఉంటుందని సమాచారం.. సినిమాల ద్వారానే కాదు రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ అనే నిర్మాణ సంస్థను కూడా నడుపుతున్నారు.

ఇకపోతే ఈ సంస్థ ద్వారా ఇతర నటీనటుల కంటే కూడా ఎక్కువ సంపాదిస్తున్నట్లు సమాచారం. మొత్తంగా ఈ నిర్మాణ సంస్థతో కలిపి కమలహాసన్ ఆస్తులు విలువ రూ.600 కోట్లు ఉన్నాయని తెలుస్తోంది. ఇక రజనీకాంత్ ఆస్తి విలువ రూ.450 కోట్లు అయితే విజయ్ ఆస్తి విలువ రూ.410 కోట్లు ఉంటుందని అంచనాలు వేస్తున్నారు. ఇక ఇతర నటీనటుల విషయానికి వస్తే.. అజిత్ రూ .350 కోట్ల ఆస్తిని కలిగి ఉండగా.. సూర్య రూ.300 కోట్లు, హీరో కార్తీక్ రూ .110 కోట్లు అలాగే ధనుష్ రూ.160 కోట్ల విలువైన ఆస్తులను కలిగి ఉన్నట్లు సమాచారం.. ఇకపోతే ప్రస్తుతం కమలహాసన్.. రూ.400 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసిన విక్రమ్ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. మరొకవైపు ప్రభాస్ , దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్ నటిస్తున్న కల్కి 2898 ఏడిలో కూడా విలన్ గా నటిస్తున్నారు.

- Advertisement -

శంకర్ దర్శకత్వంలో ఆయన నటించిన భారతీయుడు 2 చిత్రం కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక వీటన్నింటిని బట్టి చూస్తే కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక ఆస్తులు కలిగిన హీరోగా కమలహాసన్ రికార్డు సృష్టించారు.. ఒక ఆస్తిపాస్తులు విషయంలోనే కాదు అటు అభిమానుల విషయంలో అలాగే అవార్డుల విషయంలో కూడా ఆయనదే పైచేయి అనడంలో సందేహం లేదు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు