Vishwambhara : పోస్ట్ పోన్ తప్పదా? ఇదే కారణం

Vishwambhara

చిరంజీవి అభిమానులకు షాకిచ్చే న్యూస్ ఒకటి ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో వైరల్ అవుతోంది. తాజాగా ఆయన నటిస్తున్న “విశ్వంభర” మూవీ అనుకున్న సమయానికి రిలీజ్ అయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. అసలు “విశ్వంభర” పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందనే వార్తలు రావడానికి గల కారణం ఏంటి? ఈ మూవీ విషయంలో అసలేం జరుగుతోంది? అనే వివరాల్లోకి వెళ్తే…

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ ఫాంటసీ డ్రామా “విశ్వంభర”. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సోషియో ఫాంటసీ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. యువి క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు టైటిల్ గ్లింప్స్ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి, మరింత క్యూరియాసిటీని పెంచేసింది. మెగా అభిమానులు ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్న “విశ్వంభర” 2025 జనవరి 10న సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. హైదరాబాద్ లో “విశ్వంభర” కోసం 13 భారీ సెట్లు క్రియేట్ చేశారు మేకర్స్. అందులోనే సినిమా షూటింగ్ మొత్తం జరగబోతోంది.

ఇక మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాను అనౌన్స్ చేసిన ఆరు నెలల తర్వాత రీసెంట్ గా సెట్లో అడుగు పెట్టారు. ఇటీవలే హీరోయిన్ గా త్రిష నటించబోతోంది అన్న విషయాన్ని ప్రకటించిన మేకర్స్ షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం హీరో హీరోయిన్ల మీద కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.ఈ క్రమంలోనే “విశ్వంభర” వాయిదా పడొచ్చు అనే వార్తలు మెగా ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతున్నాయి.

- Advertisement -

“విశ్వంభర” మూవీని 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ చేస్తామని అఫీషియల్ గా ఎప్పుడో అనౌన్స్ చేసేసారు. కానీ తాజా సమాచారం ప్రకారం రిలీజ్ డేట్ కు ఇంకా 11 నెలలు మిగిలి ఉండగా, అప్పటిలోపు సినిమా పనులు పూర్తవ్వడం కష్టమని తెలుస్తోంది. ఎందుకంటే సోషియో ఫాంటసీ జానర్ కావడంతో ఈ సినిమాకు ఎక్కువగా వీఎఫ్ఎక్స్ వర్క్ పని ఉంటుంది. ఒకవేళ షూటింగ్ త్వరగా పూర్తి అయినా, వీఎఫ్ఎక్స్ వర్క్ కే ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి “విశ్వంభర”కి వీఎఫ్ఎక్స్ వర్క్ ఈ 11 నెలల్లో పూర్తి అవ్వడం చాలా కష్టం అని అంటున్నారు.

దీన్ని బట్టి చూస్తే “విశ్వంభర” సంక్రాంతికి రావడం కష్టమేనని అనిపిస్తోంది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో మరో ముగ్గురు హీరోయిన్లు కూడా నటించబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఆ ముగ్గురు హీరోయిన్లు ఎవరు అన్న విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు. మరి ఎవరెవరికి ఈ సినిమాలో భాగం అయ్యే అవకాశం దక్కుతుందో చూడాలి.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు