Vishwambhara: నలుగురు ఏంజిల్స్ కన్ఫర్మ్… కానీ మెగా ఫ్యాన్స్ కు ఆ విషయంలో నిరాశే

Vishwambhara

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా “విశ్వంభర” గురించి రోజుకో ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో నలుగురు హీరోయిన్ నటించబోతున్నారన్న ప్రచారం ఎప్పటినుంచో జరుగుతోంది. తాజాగా మేకర్స్ త్రిష ఈ సినిమాలో హీరోయిన్ గా నటించబోతుందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మరి మిగతా ముగ్గురు హీరోయిన్లు ఎవరు? వాళ్ల పాత్రలు ఎలా ఉండబోతున్నాయి? అనే వివరాల్లోకి వెళితే…

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ ఫాంటసీ డ్రామా “విశ్వంభర”. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సోషియో ఫాంటసీ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. యువి క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు టైటిల్ గ్లింప్స్ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి, మరింత క్యూరియాసిటీని పెంచేసింది. మెగా అభిమానులు ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్న “విశ్వంభర” 2025 జనవరి 10న సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతోంది.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. హైదరాబాద్ లో “విశ్వంభర” కోసం 13 భారీ సెట్లు క్రియేట్ చేశారు మేకర్స్. అందులోనే సినిమా షూటింగ్ మొత్తం జరగబోతోంది. ఇక మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాను అనౌన్స్ చేసిన ఆరు నెలల తర్వాత రీసెంట్ గా సెట్లో అడుగు పెట్టారు. ఈ నేపథ్యంలోనే “విశ్వంభర”లో హీరోయిన్ త్రిష నటించబోతుందని ప్రకటిస్తూ, టీం మొత్తం ఆమెకు వెల్కమ్ చెప్పారు. అయితే ఈ మూవీలో త్రిషతో పాటు మరో ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నారు.

- Advertisement -

“విశ్వంభర”లో మీనాక్షి చౌదరి, శ్రీలీల, తమన్నా కూడా కీలకపాత్రలు పోషించబోతున్నారని సమాచారం. ఇప్పటికే “విశ్వంభర” టీం ఈ హీరోయిన్లను సంప్రదించారట. మరి వాళ్లు ముగ్గురు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? అంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. ఇక వీళ్ళు ముగ్గురూ ఇతర లోకాల నుంచి భూమికి దిగివచ్చే దేవకన్యలుగా కనిపించబోతున్నారని సమాచారం. ఇంకేముంది ఈ నలుగురు దేవకన్యలతో మెగాస్టార్ రొమాన్స్ పీక్స్ లో ఉంటుంది అనుకుంటున్నారేమో. అలా అనుకుంటే గనక తప్పులో కాలేసినట్టే. వీళ్లంతా విశ్వంలో నుంచి దిగివచ్చే దేవకన్యలు మాత్రమే. అయితే చిరంజీవితో కలిసి వీళ్ళు పలు సన్నివేశాల్లో కనిపిస్తారు. కానీ అవి రొమాంటిక్ సన్నివేశాలు మాత్రం కావట. కాబట్టి ఈ ముగ్గురు దేవకన్యలతో మెగాస్టార్ కెమిస్ట్రీ గురించి ఆలోచన అవసరం లేదు అంటున్నారు.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు