Vijay Varma Tamanna: తమన్నాతో పెళ్లిపై ప్రశ్న… మేన కోడలిని లాగుతూ విజయ్ వర్మ వెరైటీ రిప్లై

Vijay Varma Tamanna

సౌత్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్లలో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఒకరు. హ్యాపీ డేస్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ గత రెండు దశాబ్దాలుగా సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. ప్రస్తుతం సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉంది ఈ బ్యూటీ. రీసెంట్ గా జైలర్, భోళా శంకర్ సినిమాలలో కనిపించిన తమన్నా నార్త్ లో లస్ట్ స్టోరీస్ 2, జీ కర్దా, ఆఖరి సచ్ వంటి వెబ్ సీరీస్ లతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేసింది.

ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమాలకు చిన్న బ్రేక్ ఇవ్వడంతో తన ప్రియుడు విజయ్ వర్మను పెళ్లి చేసుకోబోతోందని రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. తాజాగా ఇదే ప్రశ్నను ఓ నెటిజన్ విజయ్ వర్మను అడగ్గా ఆయన సీరియస్ అయ్యాడు. తమన్నా బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మతో ప్రేమలో ఉందన్న సంగతి తెలిసిందే. చాలా కాలంగా ప్రేమాయణం నడిపిస్తున్న వీళ్ళు ఎన్నోసార్లు కెమెరా కంటికి జంటగా చిక్కారు. దీంతో ఈ జంట లవ్ లో ఉందని అందరూ ఫిక్స్ అయిపోయారు.

త్వరలోనే తమన్నా, విజయ్ వర్మ పెళ్లితో ఒకటి కాబోతున్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడల్లా వీరిద్దరూ సమాధానం చెప్పకుండా తెలివిగా తప్పించుకుంటున్నారు. తాజాగా సోషల్ మీడియాలో విజయ్ వర్మకు మరోసారి తన పెళ్లి గురించి ప్రశ్న ఎదురైంది. ఇంస్టాగ్రామ్ లో ఆస్క్ మీ సెషన్ నిర్వహించాడు విజయ్ వర్మ. ఈ సందర్భంగా ఓ నెటిజన్ “పెళ్లెప్పుడు చేసుకుంటారు?” అని ప్రశ్నించారు. దానికి విజయ్ వర్మ “ఇప్పటికే మా మేనకోడలు మా అమ్మను ప్రశ్నలు అడుగుతోంది. హైదరాబాద్లో కూడా నాకు ఇదే ప్రశ్న ఎదురయింది” అంటూ రెడ్ ఎమోజితో విజయ్ రిప్లై ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.

- Advertisement -

పెళ్లి చేసుకుంటాడో లేదో చెప్పకుండా ఇలా సంబంధం లేని రిప్లై ఇవ్వడంతో నెటిజన్లు సందిగ్ధంలో పడ్డారు. మరోవైపు తమన్నా రోజుకో దేవాలయం చుట్టూ తిరుగుతూ, ప్రత్యేక పూజలు చేస్తోంది. అదంతా ఆమె పెళ్లి కోసమే చేస్తోందంటూ రూమర్స్ నడుస్తున్నాయి. ఇక విజయ్ వర్మ విషయానికి వస్తే… హైదరాబాద్ కు చెందిన ఈ యాక్టర్ “మిడిల్ క్లాస్ అబ్బాయి” సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు. అలాగే హిందీలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన పలు హిట్ సిరిస్ లలో కనిపించాడు.

తమన్నా, విజయ్ వర్మ కలిసి నటించిన ఫస్ట్ వెబ్ సిరీస్ “లస్ట్ స్టోరీస్ 2”. ఈ సిరీస్ లో వీళ్ళిద్దరి ఘాటు రొమాన్స్ బాగా వైరల్ అయింది. ప్రస్తుతం విజయ్ వర్మ సూర్య 43వ చిత్రంలో కీలకపాత్రను పోషిస్తున్నాడు. అలాగే పలు హిందీ సినిమాలతో ఈ నటుడు బిజీగా ఉన్నాడు. ఇక తమన్నా రెండు తమిళ, ఒక హిందీ మూవీలో నటిస్తోంది. అలాగే రీసెంట్ గా ఒక కామెడీ వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదంతా చూస్తుంటే ఈ జంట ఇప్పట్లో పెళ్లి పీటలు ఎక్కేలా కనిపించట్లేదు. కానీ తమన్నా, విజయ్ వర్మ పెళ్లి గురించి మాత్రం వార్తలు ఆగట్లేదు. అలాగని వీళ్లిద్దరూ వాటిని ఖండించట్లేదు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు