Sakshi Agarwal: నమ్మించి మోసం చేశారు – సాక్షి అగర్వాల్..!

Sakshi Agarwal

కోలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ లుగా పేరు తెచ్చుకున్న వారిలో అట్లీ కూడా ఒకరు.. ఇటీవల బ్లాక్ బాస్టర్ సినిమాలను తెరకెక్కిస్తూ భారీ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న ఈయన జవాన్ సినిమాతో బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టి వరుస ఆఫర్లను అందుకుంటున్నారు. గత ఏడాది షారుక్ ఖాన్ హీరోగా వచ్చిన జవాన్ సినిమా ఏకంగా రూ.1000 కోట్ల మార్క్ చేరుకుంది. ఇక డైరెక్టర్ అట్లీ విషయానికి వస్తే.. రాజారాణి సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు.. ఆర్య, నయనతార, నజ్రియా , జై తదితర నటీనటులతో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ముఖ్యంగా అట్లీ మేకింగ్ కి అభిమానులు ఫిదా అయ్యారు. దీంతో ఆయనకు వెంటనే హీరో విజయ్ తో తేరి సినిమా అవకాశం లభించింది. అది కూడా హిట్ కొట్టడంతో ఈయన వరుసగా మెర్సిల్ , బిగిల్ వంటి చిత్రాలను తెరకెక్కించి భారీ క్రేజ్ అందుకున్నారు.

అంతేకాదు జవాన్ సినిమాతో బాలీవుడ్ లో కూడా సత్తా చాటారు. ఇదిలా ఉండగా తాజాగా అట్లీ దర్శకత్వం వహించిన రాజా రాణి సినిమాపై హీరోయిన్ సాక్షి అగర్వాల్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ” నేను బెంగళూరులో ఉన్నప్పుడు రాజా రాణి సినిమా చేసే అవకాశం వచ్చింది.. అప్పుడు మోడలింగ్ చేస్తున్నాను.. ఈ చిత్రానికి సంబంధించి యూనిట్ నా కాస్టింగ్ ఏజెన్సీని సంప్రదించి రాజారాణిలో నటించడం గురించి మాట్లాడారు.. అంతేకాదు ఆ సినిమాలో ఆర్య హీరో అని.. నువ్వు సెకండ్ హీరోయిన్ అని కూడా తెలిపారు.. వారు చెప్పింది విని నేను కూడా నిజమని వెంటనే ఓకే చెప్పేసాను.. అంతేకాదు ఆ సమయంలో నాతో కొన్ని సీన్లు కూడా తీశారు. తర్వాత ఏమైందో తెలియదు కానీ ఆ చిత్ర యూనిట్ నుంచి నాకు కాల్స్ రావడం ఆగిపోయి.. కొద్ది రోజుల తర్వాత సినిమా కూడా విడుదలైంది..

అవకాశం ఇచ్చినట్లే ఇచ్చి కొన్ని సీన్లకే నన్ను పరిమితం చేశారని అర్థమయింది.. అవి కూడా ఒక రెస్టారెంట్లో కాఫీ ఆర్డర్ చేసే పాత్రలో మాత్రమే చూపించారు.. నువ్వే సెకండ్ హీరోయిన్ అని చెప్పి చాలా చిన్న పాత్ర ఇచ్చారు.. ఇక అందుకు కారణాలు ఏంటో ఇప్పటికీ తెలియదు.. అదే సమయంలో దీని గురించి అట్లీతో మాట్లాడి ఉండుంటే బాగుండేది.. ఆయనతో మాట్లాడకపోవడం నా తప్పయింది.. హీరోయిన్గా ఛాన్స్ ఇస్తానని చెప్పి నమ్మకద్రోహం చేశారు” అంటూ తెలిపింది సాక్షి అగర్వాల్.. మోడల్ అయిన సాక్షి అగర్వాల్ కి తమిళ్లో పెద్దగా అవకాశాలు లభించలేదు.రజనీకాంత్ నటించిన కాలా సినిమాలో రజనీకాంత్ కోడలిగా నటించిన మెప్పించింది. బిగ్ బాస్ లో కూడా పాల్గొని మరింత పాపులారిటీ దక్కించుకున్న ఈమె ప్రస్తుతం కమర్షియల్ చిత్రాలలో నటిస్తోంది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు