Ram Charan – Upasana: మేమ్ అక్కడే పుట్టాం.. మా ఫేవరెట్ సిటీ అదే..!

Ram Charan – Upasana

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న జోడీలలో రామ్ చరణ్ – ఉపాసన జంట కూడా ఒకటి.. ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఈ జంట నిత్యం వార్తల్లో నిలుస్తూ ఏదో ఒక విషయంపై చర్చిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే నిన్న అపోలో ఫౌండర్ డాక్టర్ ప్రతాప్ చంద్ర రెడ్డి 91వ పుట్టినరోజు కాగా..ఈ సందర్భంగా ఉపాసన “ది అపోలో స్టోరీ”అనే పుస్తకాన్ని లాంచ్ చేశారు. చెన్నైలోని అపోలో హాస్పిటల్లో ఈ పుస్తక లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.. ఇందులో డాక్టర్ ప్రతాపరెడ్డి గురించి.. అపోలో హాస్పిటల్స్ సంస్థ ఎదిగిన విధానం.. ఎదుర్కొన్న సవాళ్లు ఇలా అనేక అంశాలను పుస్తకంలో పొందుపరిచారు..

పుస్తక లాంచింగ్ కార్యక్రమం తర్వాత ఉపాసన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అపోలో గురించి.. తన తాతయ్య గురించి.. అలాగే తన తాతయ్య తన కూతుళ్ళతో ఎలా స్పూర్తితో పెంచారు అన్న విషయాలను ఆమె మాట్లాడింది.. ఈ పుస్తకాన్ని ప్రతి తండ్రి చదవాలని.. ఈ పుస్తకం చదివి ప్రతి మహిళ స్ఫూర్తి పొందాలని ఉపాసన తెలిపింది. అలాగే చెన్నై సిటీ గురించి కూడా ఈమె మాట్లాడుతూ.. నేను ఇక్కడే పుట్టాను , రామ్ చరణ్ కూడా ఇక్కడే పుట్టారు. నాకు చెన్నై సిటీ అంటే ఇష్టం.. ఇక చరణ్ కి చెన్నై మీద ప్రేమ.. అందుకే చెన్నై సిటీ మా ఇద్దరికీ కూడా చాలా స్పెషల్.. ఇటు కొణిదెల, అటు కామినేని కుటుంబాలపై తెలుగు వాళ్లే కాదు తమిళ ప్రజలు కూడా అభిమానం చూపిస్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు అంటూ తెలిపింది ఉపాసన.. ఇక మొత్తానికైతే ఉపాసన రాంచరణ్ లకు చెన్నై సిటీ అంటే చాలా ఇష్టం అని ఈ వ్యాఖ్యల ద్వారా అర్థమవుతుంది.

రామ్ చరణ్ విషయానికి వస్తే.. రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేసి భారీ విజయాన్ని అందుకోవడమే కాదు ఈ సినిమాతో ఏకంగా ఆస్కార్ రెడ్ కార్పెట్ పై మెరిసిన ఈయన గ్లోబల్ స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా పూర్తి అయిన వెంటనే ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు సనా దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రాంచరణ్.. మొత్తానికైతే ఈ పాన్ ఇండియా చిత్రాలతో భారీ ఇమేజ్ సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

- Advertisement -

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు