Pooja Hegde: క్యూట్‌ అందాలతో మెరిసిన పూజా హెగ్డే

Pooja Hegde

బుట్టబొమ్మ పూజ హెగ్డే గురించి తెలియని వారుండరు. బుట్టబొమ్మ పూజ హెగ్డే ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఇప్పుడు టాలీవుడ్ లో ఆమెకు చిత్రాలు లేక…. కష్టాల్లో ఉందనే విషయం తెలిసింది. ఈ భామకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమానే లాస్ట్ హిట్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్గా చేసింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయింది.

ఇక ఈ సినిమా తర్వాత ఆమెకు ఏ సినిమా కలిసి రాలేదు. ఆ తర్వాత చిరంజీవి, రామ్ చరణ్ తో కలిసి ఆచార్య సినిమాలో నటించింది. అటు రాధేశ్యామ్ సినిమాలోనూ ప్రభాస్ తో కలిసి రొమాన్స్ చేసింది. మరోవైపు తలపతి విజయ్ తో కలిసి బీస్ట్ సినిమాలో నటించింది. అయితే ఈ మూడు సినిమాలు ఆమెకు చేదు ఫలితాన్ని ఇచ్చాయి. ఈ మూడు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాయి. అంతేకాదు పూజ హెగ్డేపై పలు విమర్శలు కూడా వచ్చాయి. ఇక మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన గుంటూరు కారం సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా చేయాల్సి ఉండే.

కానీ ఏం జరిగిందో తెలియదు ఆమెను తప్పించారో లేదా తప్పకుందో తెలియదు కానీ ఆ సినిమా నుంచి పూజ హెగ్డే అవుట్ అయింది. ఇక ఆమె స్థానంలో మీనాక్షి చౌదరి వచ్చి చేరింది. టాలీవుడ్, బాలీవుడ్ లో వరుస ప్లాప్ లు రావడంతో నల్లపూసైపోయింది నటి పూజా హెగ్డే. అవకాశాలు లేక వెకేషన్ ట్రిప్స్ వేస్తున్న ఈ ముద్దుగుమ్మ తన లేటెస్ట్ లుక్స్ తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. సిల్వర్ కలర్ డ్రెస్ లో పూజ పరువాలు చూపిస్తూ నెటిజన్లను కట్టిపడేస్తోంది.అయితే..తాజాగా వైట్‌ డ్రెస్‌ లో మెరిసింది పూజా హెగ్డే. ఈ ఫోటోలు వైరల్‌ గా మారాయి. సినిమాల్లో ఛాన్సుల కోసమే.. అప్పుడప్పుడు పూజా హెగ్డే తన అందాలను ఆరబోస్తుందని నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

- Advertisement -

Pooja Hegde is showing off in a silver colour dress

Pooja Hegde is showing off in a silver colour dress

Pooja Hegde is showing off in a silver colour dress

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు