Trisha: త్రిష లైనప్ మామూలుగా లేదుగా..ఏకంగా అరడజను..!

Trisha

ప్రముఖ హీరోయిన్ త్రిష సినీ ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలకు పైగానే అవుతున్నా …తన స్టార్ స్టేటస్ తో ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తోంది అంటే ఇక ఆమెకు ఏ రేంజ్ లో ప్రేక్షకులు పట్టం కట్టారో అర్థం చేసుకోవచ్చు. తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె.. ఒక తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ పరిశ్రమలో కూడా తన ప్రతిభ కనబరుస్తూ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. కొంత కాలం సినిమా ఇండస్ట్రీ కి గ్యాప్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమాతో మరొకసారి లైమ్ లైట్ లోకి వచ్చింది .. అంతేకాదు విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ కి పోటీగా నటించి.. తన అందంతో ప్రేక్షకులను మెప్పించింది.

ఈ సినిమా తర్వాత ఈమె కెరియర్ గ్రాఫ్ కూడా అమాంతం పెరిగిపోయింది అనడంలో సందేహం లేదు. రీసెంట్ గా విజయ్ హీరోగా వచ్చిన లియో సినిమాలో నటించి గ్లామర్ బ్యూటీగా ప్రేక్షకులను అలరించింది.. ఈ సినిమా తర్వాత త్రిష లైనప్ చూస్తే మాత్రం ఆశ్చర్య పోవాల్సిందే. దాదాపు 18 సంవత్సరాల విరామం తర్వాత మళ్లీ తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన నటించడానికి సిద్ధం అయ్యింది.. తాజాగా చిరంజీవి విశ్వంభర సినిమాని చేస్తున్న విషయం తెలిసిందే.. ఇందులో త్రిష నటిస్తోందని అధికారికంగా చిత్ర బృందం ప్రకటించింది .. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ కి త్రిష వచ్చినట్లు చిరంజీవి కూడా వీడియో షేర్ చేశారు.

స్టాలిన్ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.. మరొకపక్క పంజా డైరెక్టర్ విష్ణువర్ధన్ సల్మాన్ చిత్రంలో కూడా హీరోయిన్ గా త్రిష అవకాశాన్ని దక్కించుకుంది.. అయితే ఈ సినిమాలో ముందుగా సమంతను హీరోయిన్ గా అనుకోగా.. ఆమె సైడ్ అవడంతో ఆ ప్లేస్ త్రిషకి కన్ఫర్మ్ చేశారు ..మరొకవైపు విదాముయార్చి అనే తమిళ సినిమాలో కూడా అజిత్ సరసన హీరోయిన్ గా అవకాశాన్ని దక్కించుకుంది.. వీటితో పాటు మలయాళంలో సూపర్ క్రేజ్ కాంబో గా గుర్తింపు తెచ్చుకున్న జీతూ జోసెఫ్ – మోహన్ లాల్ కాంబినేషన్లో వస్తున్న రామ చిత్రంలో కూడా హీరోయిన్గా త్రిష చాన్స్ దక్కించుకోవడం గమనార్హం.

- Advertisement -

అలాగే మణిరత్నం లోకనాయకుడు కమలహాసన్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో కూడా హీరోయిన్గా త్రిష అవకాశాన్ని దక్కించుకుంది. వీటితోపాటు నిర్మాణంలో ఉన్న ఐడెంటిటీ అనే మరో చిత్రంలో కూడా త్రిష నటిస్తోంది.. దీన్ని బట్టి చూస్తే కుర్ర హీరోయిన్ల కంటే చాలా బిజీగా వరుస ప్రాజెక్టులను ప్రకటిస్తూ స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంటుంది త్రిష.. ఇక ప్రస్తుతం ఈమె చేతిలో ఉన్న లైనప్ చూస్తే మాత్రం మరో రెండేళ్ల వరకు త్రిష కాల్ షీట్స్ దొరికే ప్రసక్తి లేదు అన్నట్లు తెలుస్తోంది. ఇంకోపక్క ఇప్పటివరకు బ్యాచిలర్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న ఈమె.. పెళ్లి ఊసత్తితే ఆ మాటను దాటేస్తోంది.. మరి తన సినిమాలన్నీ పూర్తి చేసిన తర్వాత అయినా వివాహం చేసుకుంటుందో లేదో చూడాలి.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు