Mohanlal: రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న పీరియాడిక్ డ్రామా..

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ గురించి ప్రత్యేకంగా తెలియనక్కర్లేదు. ఈయన చేసే ప్రతి చిత్రం లోను ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకుంటాడు. కంప్లీట్ యాక్టర్ అని అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీలో పేరు పొందిన ఈయన వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. లూసిఫర్ తర్వాత ఆ స్థాయి విజయం లేని ఆయన మళ్ళీ కమ్ బ్యాక్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. మధ్యలో దృశ్యం మూవీ 2 హిట్ అయినా అది ఓటీటీ లో మాత్రమే విడుదలయింది. ఇక చివరగా ‘నేరు’ సినిమా తో ఆడియన్స్ ముందుకు రాగా ఆ మూవీ అంతగా ఆకట్టుకోలేదు. అంతకు ముందు జైలర్ మూవీ లో స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చాడు.

ఇక తాజాగా మోహన్ లాల్ నటించిన తాజా చిత్రం “మలైకోటై వాలీబన్”. ఈ మూవీని జల్లికట్టు ఫేమ్ “లిజో జోస్” డైరెక్ట్ చేయగా, పీరియాడిక్ డ్రామా గా రూపొందిన ఈ సినిమాలో మోహన్ లాల్ సరికొత్తగా కనిపించనున్నారు. ఇక విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ లో భారీ గడ్డం, మీసాలతో ఉన్న లుక్ లో ఒక పెద్ద తాడుతో ఎదో లాగుతున్నట్టు, ఒక యోధుడిలా కనిపించిన మోహన్ లాల్, తన కెరీర్లో మరో భిన్నమైన సినిమా చేసాడని తెలుస్తూనే ఉంది.

ఇక ఈ మూవీని జాన్ మ్యారి క్రియేటివ్ బ్యానర్ పై శిబూ బేబీ జాన్ నిర్మించాడు. కాగా ఈ సినిమాకు ప్రశాంత్ పిళ్ళై మ్యూజిక్ అందించగా, షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకున్న మలైకోటై వాలీబన్ సినిమాను 2024 జనవరి 25న రిలీజ్ అవుతున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేసారు. అయితే టీజర్ లో ఆల్రెడీ మేకర్స్ రిలీజ్ డేట్ ని ప్రకటించినా, సోషల్ మీడియా లో ఈ సినిమా వాయిదా పడ్డట్టు వార్తలు రాగా, మేకర్స్ అదంతా ఉట్టిదేనని తేల్చేసి రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చేసారు. ఇక అదే రిపబ్లిక్ డే రోజు తెలుగులో ప్రతినిధి2, తమిళ్ లో విక్రమ్ తంగాలాన్ రిలీజ్ కి రెడీ అవుతున్నాయి.

- Advertisement -

For More Updates :Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు