NaaSaamiRanga: ప్రమోషన్లలో అందరికంటే నాగ్ ముందు.. ఎందుకంటే?

టాలీవుడ్ లో ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాల్లో నాగార్జున నా సామిరంగ కూడా ఒకటి. విజయ్ బిన్నీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని శ్రీనివాస్ సిల్వర్ స్క్రీన్ బ్యానర్ లో శ్రీనివాస్ చిట్టూరి నిర్మించారు. నిజానికీ సంక్రాంతి సినిమాల్లో అందరికంటే లాస్ట్ గా జనవరి 14న వస్తున్న నాగార్జున సినిమా ప్రమోషన్లలో మాత్రం అందరికంటే ముందున్నాడు. పైగా నాగార్జున ప్రమోషన్లలో స్టార్ హీరోలు ఏమాత్రం సరిపోరు అనాలి. ఎందుకంటే పండక్కి వస్తున్న సినిమాల్లో అందరికంటే లేటుగా మొదలై, అందరికంటే ముందుగా అన్ని పనులు ఫినిష్ చేసుకున్న సినిమా నా సామి రంగ అనే చెప్పాలి.

అయితే ప్రమోషన్లలో మాత్రం నాగ్ పక్కా ప్లానింగ్ తో ఉన్నాడని చెప్పాలి. నాగార్జున ఒకపక్క బిగ్ బాస్ హోస్టింగ్ గా చేస్తూనే, నా సామి రంగ సినిమాని పూర్తి చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే బిగ్ బాస్ షో లో రెండు నెలల ముందు నుండి నా సామి రంగ కోసం మూడు సార్లు ప్రమోట్ చేసాడు. ఫస్ట్ హీరోయిన్ అషికా రంగనాథ్ ని బిగ్ బాస్ షో లోనే చూపించిన నాగ్, ఆ తర్వాతే సినిమాలో ఈ హీరోయిన్ ఉందని మేకర్స్ చేత సోషల్ మీడియా లో అనౌన్స్ చేయించాడు.

అలాగే అల్లరి నరేష్, రాజ్ తరుణ్ తో కూడా బిగ్ బాస్ కి తీసుకొచ్చి ప్రమోషన్ చేయించగా, చివరగా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ని కూడా తీసుకుని వచ్చి ప్రమోట్ చేయించాడు. ఇక లేటెస్ట్ గా బిగ్ బాస్ ని అందరూ మర్చిపోయినా, నాగ్ గుర్తు చేసి మరీ వాళ్ళని స్టార్ మా కి తీసుకొచ్చి, నా సామి రంగ కి ప్రమోషన్ చేయించాడు. అయితే నాగార్జున ప్రమోషన్స్ లో వాళ్ళ కంటే ఎందుకు తోపంటే, సోషల్ మీడియా లో గుంటూరు కారం సినిమా ఎంత ప్రమోట్ చేసినా దానికి భారీగా ఖర్చు పెట్టాలి.

- Advertisement -

కానీ నాగార్జున బిగ్ బాస్ ని వాడుకుంటూనే, అందులో భాగంగా నా సామిరంగకి ఖర్చు లేకుండా ప్రమోట్ చేసాడు. అన్నిటికి మించి డైరెక్ట్ గా చేసే ప్రమోషన్స్ కంటే బుల్లితెర పై చేసే ప్రమోషన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించడానికి హెల్ప్ చేస్తుంది. అందుకే నాగార్జున వాళ్ళ కంటే ప్రమోషన్స్ విషయంలో తోపు. ఇక స్టార్ మా లో నా సామిరంగ లేటెస్ట్ ప్రమోషన్ ప్రోమో రిలీజ్ చేయగా అది చూసిన నెటిజన్లు, గుంటూరు కారం కి ప్రమోషన్లలో పెట్టె పదో వంతు కూడా నా సామి రంగకి అవసరం లేదని కామెంట్స్ చేస్తున్నారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు