Thandel: ఒక్క షాట్ తో మొత్తం కొట్టేసింది..

నాగ చైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో “తండేల్” అనే సినిమాలో నటిస్తున్నాడని తెలిసిందే. సముద్ర తీరా ప్రాంతాల్లో నివసించే చేపల జాలర్ల నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా బతుకుదెరువు కోసం గుజరాత్ లో ఉన్న ‘వీరవల్’ అనే ప్రాంతానికి వెళ్లి చేపల వేట సాగిస్తూ, పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ లకు చిక్కిన మత్స్యకారుల జీవితం ఆధారంగా “తండేల్” మూవీ రూపొందుతుంది. ఇక ఈ సినిమా టీజర్ తాజాగా రిలీజ్ అవగా సోషల్ మీడియా లో ట్రెండింగ్ లో ఉంది.

నాగ చైతన్య ని ఇంట్రడ్యూస్ చేస్తూ వచ్చిన ఈ టీజర్ మంచి క్రియేటివిటీ తో ఆడియన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోగా, చై కి కూడా పక్కా హిట్ అనే నమ్మకాన్ని ఇస్తుంది. అయితే ఈ టీజర్ లో నిమిషంన్నర కి పైగా ఉన్న నాగ చైతన్యు కంటే, కనీసం 20 సెకన్లు కూడా లేని ఓ వ్యక్తి ఒక్క షాట్ తో టీజర్ ద్వారా క్రెడిట్ మొత్తం కొట్టేసారు. ఆ వ్యక్తి సాయి పల్లవి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో డీ గ్లామర్ గా కనిపిస్తున్న నాగ చైతన్య, టీజర్ లో ఊర మాస్ లుక్ తో తన డైలాగ్ డెలివరి తో మెప్పించగా, లాస్ట్ లో సాయి పల్లవి ఎంట్రీ ఇచ్చి ఒక్క స్మైల్ ఇస్తుంది.

ఆ ఒక్క స్మైల్ కి ఫ్యాన్స్ పడిపోయారని చెప్పొచ్చు. మామూలుగానే పెర్ఫార్మన్స్ స్కోప్ ఉండే పాత్రలు చేసే సాయి పల్లవి ఈ సినిమాలో నాగ చైతన్య సరసన సత్య పాత్రలో నటిస్తుండగా, ఇంపార్టెన్స్ విషయంలో చై కి ఏమాత్రం తగ్గదని టీజర్ ద్వారా తెలిసింది. ఇక టీజర్ కింద కామెంట్స్ కూడా టీజర్ లో చై కంటే, లాస్ట్ లో సాయి పల్లవి ఒక్క స్మైల్ షాట్ తో క్రెడిట్ కొట్టేసిందని, దాని గురించి పెట్టిన కామెంట్సే ఎక్కువ. ఏది ఏమైనా సాయి పల్లవి ఈ సినిమా తర్వాత తెలుగులో వరుస సినిమాలు చేస్తుందని నెటిజన్లు భావిస్తున్నారు.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Gossips, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు