Abhishek Bachchan: ఐశ్వర్యతో పెళ్లి.. చివరికి నా జీవితం ఎలా మారిందంటే – అభిషేక్..!

Abhishek Bachchan: బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు పొందిన అభిషేక్ బచ్చన్ – ఐశ్వర్యరాయ్ అత్యంత ప్రజాదరణ పొందిన జంటలలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇద్దరూ తమ ప్రేమను నిరూపించుకోవడమే కాదు.. తమ నటనతో అభిమానులను కూడా ఆకట్టుకున్నారు. ఇద్దరూ కూడా తమ వ్యక్తిగత జీవితంలోని విషయాలతో పాటు సినిమా విషయంలో కూడా మంచి పాపులారిటీ సంపాదించారు. ముఖ్యంగా ఐశ్వర్య – అభిషేక్ జంట గత కొంతకాలంగా విడాకుల వ్యవహారంలో చర్చనీయాంశంగా మారారు.. కానీ ఇప్పటివరకు ఈ విషయం పై ఎవరు క్లారిటీ ఇవ్వలేదు.

ముఖ్యంగా ఐశ్వర్య .. అభిషేక్ ఇంటిని విడిచి బయటికి వచ్చి తన కూతురు ఆరాధ్య తో విడిగా ఉంటోంది అన్నట్లుగా వార్తలు వినిపించాయి. ఇలాంటి సమయంలో ఐశ్వర్య – అభిషేక్ ఇద్దరు కూడా తమ కుమార్తె వార్షిక కార్యక్రమాలలో పాల్గొనడంతో ఈ వార్తలకు స్వస్తి పలికిందని చెప్పవచ్చు.. గతంలో ఒక ఇంటర్వ్యూలో అభిషేక్ తన భార్య ఐశ్వర్య నుండి నేర్చుకున్న పలు విషయాలను సైతం తెలియజేశారు.. అలాగే ఆమె కోడలుగా బాధ్యత తీసుకోవడం గురించి కూడా మాట్లాడారు అభిషేక్ బచ్చన్.

ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిషేక్ మాట్లాడుతూ.. ఐశ్వర్య తనకు ఎన్నడు లేనటువంటి ఒక నమ్మకాన్ని ఇచ్చిందని తెలిపారు. తాను ఎప్పుడూ కూడా దేనికి బాధ్యతగా వ్యవహరించనని.. కానీ వివాహమైన తర్వాత తన భార్య పట్ల బాధ్యతగా వ్యవహరించాలని అనుకున్నట్లు తెలియజేశారు. తన ప్రకారం పెళ్లి అనేది ఒక రాజీ కాదని అభిషేక్ బచ్చన్ తెలియజేశారు. తన జీవితంలోకి ఐశ్వర్య రావడం చాలా ఆనందాన్ని కలిగించిందని తెలియజేశారు..

- Advertisement -

సమాజంలో మనం ఎలాంటి విషయాలలోనైనా సరే సామాన్యంగా.. వాస్తవికంగా ఉండడం తన భార్య ఐశ్వర్య తనకు నేర్పించిందంటూ అభిషేక్ తెలియజేశారు.. ఐశ్వర్యరాయ్ సినిమాల విషయానికి వస్తే పొన్నియన్ సెల్వన్-2 చిత్రంలో నటించింది. ఇందులో ఈమెతో పాటు త్రిష, విక్రమ్ ,జయం రవి, కార్తీ తదితర నటులు కీలక పాత్రలు పోషించారు. ఇక అభిషేక్ బచ్చన్ మాత్రం ఘుమర్ అనే చిత్రంలో కనిపించారు. ఏది ఏమైనా ఐశ్వర్యరాయ్ తన జీవితంలోకి రావడమే కాదు తన లైఫ్ ని కూడా మార్చేసింది అంటూ అభిషేక్ బచ్చన్ తెలియజేశారు.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Gossips, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు