Thandel: రాజు కోసం ‘సత్య’ వచ్చేసింది..!

ఫిదా ‘సాయి పల్లవి’ మళ్ళీ బిజీ అయింది. ఏడాదికాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ ఫిదా పిల్ల చాలా రోజుల తరువాత నాగ చైతన్య సినిమాకు ఒకే చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకి ఒకే చెప్పడానికి కూడా సాయి పల్లవి బాగా టైం తీసుకుంది. పైగా సాయి పల్లవి గ్లామర్ రోల్స్ కంటే పెర్ఫార్మన్స్ స్కోప్ ఉన్న రోల్ కే ఇంపార్టెన్స్ ఇస్తుందన్న విషయం తెలిసిందే. ఇక నాగ చైతన్య సాయి పల్లవి కాంబోలో వచ్చిన లవ్ స్టోరీ మంచి బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు మూడేళ్ళ తరవాత ఈ కాంబో రిపీట్ అయింది.

చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ‘తండేల్’ లో నాగ చైతన్య సాయి పల్లవి హీరో, హీరోయిన్లుగా నటిస్తుండగా, అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమా తాజా షెడ్యూల్ వైజాగ్ పరిసర సముద్ర తీర ప్రాంతాల్లో జరుగుతుంది. ఆ షెడ్యూల్ లో ఈరోజే అడుగుపెట్టిన నాగ చైతన్య సాయంత్రం పూట సముద్ర తీరాన్ని, సన్ రైజ్ ని ఆస్వాదిస్తున్న బ్యాక్ స్టిల్ ని మేకర్స్ తాజాగా అప్లోడ్ చేసారు.

అయితే సోషల్ మీడియా లో అప్లోడ్ చేసిన ఈ స్టిల్ తో పాటు ఈ మూవీ లో హీరోహీరోయిన్ల క్యారెక్టర్స్ పేర్లు కూడా రివీల్ చేసేసారు మేకర్స్. సాయి పల్లవి స్టిల్ పెడుతూ రాజు యొక్క సత్య తమ సెట్స్ లో జాయిన్ అయిందని తెలిపారు. ఈ విధంగా తండేల్ లో నాగ చైతన్య రాజుగా, సాయి పల్లవి సత్య పాత్రల్లో నటిస్తున్నారని తెలిసింది. ఇక నాగ చైతన్య ఈ సినిమాలో చేపల జాలరిగా బోట్ నడిపేవాడిగా కనిపిస్తున్నాడు. 2024 సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Gossips, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు