Thandel : షూటింగ్ అంతా ఆ రెండు ప్రాంతాల్లోనే!

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య లేటెస్ట్ మూవీ ‘ తండేల్‘. ఈ మూవీ షూటింగ్ మొత్తం రెండు ప్రాంతాల్లోనే జరగబోతుందట. మరి ఆ రెండు ప్రాంతాలు ఏంటి అనే వివరాల్లోకి వెళితే…

నాగ చైతన్య హీరోగా యంగ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న తండేల్ మూవీలో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి హీరోయిన్ గా కనిపించనుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాదులో జరిగాయి. దీంతో ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికరమైన అంశాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మూవీ షూటింగ్ మేజర్ పార్ట్ ఎక్కడ జరగబోతోంది విషయం కూడా బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ షూటింగ్ మొత్తం శ్రీకాకుళం, గుజరాత్ సముద్ర తీర ప్రాంతాల్లోనే జరగబోతుందట. మేజర్ పార్ట్ అంతా అక్కడే చిత్రీకరించడానికి ప్లాన్ చేశారట మూవీ టీం.

సినిమా కథ విషయానికొస్తే… బతుకుదెరువు కోసం గుజరాత్ లో ఉన్న వీరవల్ అనే ప్రాంతానికి వెళ్లి చేపల వేట సాగిస్తూ, పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ లకు చిక్కిన మత్స్యకారుల జీవితం ఆధారంగా తండేల్ మూవీ రూపొందుతోంది. అందుకే షూటింగ్ కోసం శ్రీకాకుళం, గుజరాత్ వంటి సముద్ర తీర ప్రాంతాలను లొకేషన్ గా ఎంచుకున్నారట మేకర్స్. సినిమా కథనానికి సరిగ్గా సరిపోయే ఈ లొకేషన్స్ ను డైరెక్టర్ ఏ విధంగా ఉపయోగించుకోబోతున్నాడు? ఆ విజువల్స్ సినిమాను చూస్తున్న ప్రేక్షకులపై ఎలాంటి ఎఫెక్ట్స్ చూపించబోతున్నాయి అనే చర్చ అప్పుడే స్టార్ట్ అయిపోయింది.

- Advertisement -

ఎట్టకేలకు నాగ చైతన్య ఒక మంచి కంటెంట్ బేస్డ్ మూవీతో ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటిదాకా రొమాంటిక్ అండ్ మాస్ జోనర్లలో మాత్రమే నటించిన చైతూ ఇప్పుడు కొత్త జోనర్ లోకి అడుగు పెట్టడం అక్కినేని ఫ్యాన్స్ కి సైతం అనిపించవచ్చు. ఇక చాలా కాలం నుంచి హిట్ లేక అవస్థలు పడుతున్న నాగచైతన్య ఈ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. అందుకే ఈ సినిమాలో తన పాత్ర కోసం కొన్ని రోజులపాటు వర్క్ షాప్స్ వంటివి నిర్వహించి, మత్స్యకారుల నిజ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకున్నాడట నాగ చైతన్య. అంతేకాకుండా ఈ మూవీ కోసం తన మేకోవర్ పూర్తిగా మార్చేసిన విషయం తెలిసిందే. ఇక సినిమాలో సాయి పల్లవి లాంటి అద్భుతమైన నటి ఉండడం తండేల్ టీంకు మరో ప్లస్ పాయింట్. మరి ఈ సినిమా కోసం నాగ చైతన్య పడుతున్న కష్టం ఎంతవరకు ఫలిస్తుంది? అన్నది ప్రేక్షకుల చేతుల్లోనే ఉంది.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Gossips, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు