Thandel : షూటింగ్ స్టార్ట్ అయ్యాక పూజ ఏంటో? కొత్త ట్రెండా?

అక్కినేని వారసుడు నాగ చైతన్య తాజా చిత్రం ‘తండేల్’. తాజాగా ఈ సినిమాకు పూజా కార్యక్రమాలు జరిగాయి. అయితే ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయిన సినిమాకు ఇప్పుడు పూజా కార్యక్రమాలు ఏంటి అనే విషయం ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది.

యంగ్ హీరో నాగచైతన్య చాలా కాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ ఏడాది చైతు హీరోగా నటించిన కస్టడీ మూవీ థియేటర్లలోకి వచ్చినప్పటికీ ఆయన అభిమానులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. దీంతో నాగ చైతన్య ఖాతాలో మరో డిజాస్టర్ పడింది. ప్రస్తుతం నాగ చైతన్య చందూ మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో నాగ చైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై టాలీవుడ్ టాప్ డైరెక్టర్ అల్లు అరవింద్ రూపొందిస్తున్న ఈ మూవీకి ‘తండేల్’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు మేకర్స్. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ సినిమాపై బజ్ పెంచేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ లాంచింగ్ ఈవెంట్ ను హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించారు. ఈ వేడుకకు విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగార్జున ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అతిధుల సమక్షంలో చిత్ర బృందం ఈరోజు ఉదయం 10:30కు ముహూర్తం షాట్ ను చిత్రీకరించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ‘ తండేల్’ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితం స్టార్ట్ అయిపోయింది. నిజానికి పూజా కార్యక్రమం అనేది సినిమాను స్టార్ట్ చేయడానికి ముందు చేసేది. కానీ తండేల్ మూవీ విషయంలో మాత్రం మేకర్స్ ఆ కట్టుబాట్లను తప్పి వెరైటీగా షూటింగ్ స్టార్ట్ అయిన కొన్ని రోజులకు మూవీ ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. దీంతో మూవీ స్టార్ట్ చేయడానికి ముందు పూజ కార్యక్రమం చేయాలి గానీ, వీళ్ళు ఏంటి మూవీ షూటింగ్ సగం అయిపోయాక ప్రారంభోత్సవం అంటూ హడావిడి చేస్తున్నారు అని గుసగుసలాడుకుంటున్నారు ఫిలింనగర్ సర్కిల్స్ లో. తండేల్ టీం కొత్త ట్రెండ్ స్టార్ట్ చేస్తోందా? అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

కాగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ మత్స్యకారుల జీవితం నేపథ్యంలో తెరకెక్కుతోంది. ప్రస్తుతం తండేల్ మూవీ పైనే నాగచైతన్య ఆశలన్నీ పెట్టుకున్నాడు. అక్కినేని ఫ్యాన్స్ సైతం తండేల్ మూవీతో నాగ చైతన్య హిట్ కొట్టడం ఖాయమని గట్టిగా నమ్ముతున్నారు. మరి ఈ మూవీ అయినా నాగ చైతన్యకు సరైన హిట్ ఇస్తుందా? అనేది వేచి చూడాలి.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Gossips, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు