Premam: ఆ డైరెక్టర్ తో హ్యాట్రిక్ సినిమా చేయనున్న నాగ చైతన్య?

నాగ ఛైతన్య కి ఇప్పుడు ఒక భారీ హిట్టు పడాలి. ఒకప్పుడు టైర్ 2 లో టాప్ ప్లేస్ లో ఉన్న నాగచైతన్య తన వరుస ప్లాపులతో డీలా పడ్డాడు. లాక్ డౌన్ ఎఫెక్ట్ లో కూడా లవ్ స్టోరీ, బంగార్రాజు లాంటి సూపర్ హిట్లు కొట్టిన నాగచైతన్య ఇప్పుడు హ్యాట్రిక్ పరాజయాలతో నిరుత్సాహం లో ఉన్నాడు. అటు అక్కినేని హీరోలు అందరూ ప్లాప్ లు ఎదుర్కొని అక్కినేని పరువు పోగొట్టుకున్నారు. ఇక అక్కినేని నాగచైతన్య కూడా థ్యాంక్ యూ, లాల్ సింగ్ చద్దా, కస్టడీ సినిమాలతో వరుస పరాజయాలను అందుకుని తన మార్కెట్ ని తగ్గించుకున్నాడు. అటు అక్కినేని అభిమానులు కూడా తమ హీరోల వరుస పరాజయాలతో తలెత్తుకోలేకపోతున్నారు.

ఇప్పుడు అక్కినేని వారి పరువు నాగ చైతన్య చేతిలో ఉంది. ఎందుకంటే అక్కినేని ఫ్యామిలీ లో ఇప్పుడున్న హీరోల్లో డిఫరెంట్ జోనర్లో సినిమాలు తీస్తుంది చైతన్య ఒక్కడే. కాబట్టి తనే హిట్టు కొట్టాలని డిసైడ్ అయ్యాడు. అందుకే తనకు సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ చందు మొండేటి తో కలవనున్నాడని సమాచారం అందింది. ఇంతకు ముందు వీరి కాంబినేషన్ లో వచ్చిన “ప్రేమమ్” బ్లాక్ బస్టర్ హిట్ అవ్వగా, సవ్యసాచి ప్లాప్ అయినా మంచి చిత్రం గా విమర్శకుల ప్రశంసలందుకుంది. ఇప్పుడు వీరి కాంబో లో హ్యాట్రిక్ చిత్రం గా ఓ సినిమా రూపొందనుంది అని ఇప్పటికే కథ కూడా ఫైనలైజ్ అయ్యిందని త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.

ఇక వీరి కాంబో లో రాబోయే మూవీని “గీతా ఆర్ట్స్” బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మించబోతున్నారని టాక్ నడుస్తుంది. ఇక చందు మొండేటి కార్తికేయ2 బ్లాక్ బస్టర్ తో జోరుమీదున్నాడు. ఇప్పటి వరకు మరో సినిమా అనౌన్స్ చేయలేదు కాబట్టి నాగ చైతన్య తోనే తన సినిమా అని ఫిక్స్ అయిపోవచ్చు. మరి ఈ సినిమాతో మంచి కం బ్యాక్ హిట్ కొట్టి అక్కినేని వారి పరువు కాపాడతాడా లేదా అన్నది చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Gossips, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు