Nikhil Siddharth: బన్నీ థియేటర్లో విడుదల చేయనున్న “స్పై” ట్రైలర్

“స్పై” చిత్ర యూనిట్ జోరు మీదుంది. మొన్నటివరకు రిలీజ్ డేట్ విషయంలో కంఫ్యూజన్ లో ఉన్న చిత్ర యూనిట్ ఆ సందిగ్ధావస్థ నుండి బయటికి వచ్చి జూన్ 29 నే సినిమాను రిలీజ్ చేస్తున్నామని ప్రకటించడం జరిగింది. నిఖిల్ సిద్ధార్థ్ కార్తికేయ2 సినిమా తర్వాత చేస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం ఇది. సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ నేపథ్యంలో ఈ సినిమా వస్తున్నందున “స్పై” మూవీ పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో కోలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా, గ్యారి బిహెచ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

ఇక “స్పై” సినిమాకి సంబంధిచిన టీజర్ ఇప్పటికే రిలీజ్ అయ్యి సూపర్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. స్పై థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాను “ఈడీ ఎంటర్టైన్మెంట్స్” బ్యానర్ లో కే. రాజేశ్వర రెడ్డి నిర్మించాడు. శ్రీ చరణ్ పాకాల ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ సినిమా నుండి విడుదలైన పాటలు కూడా చాలా బాగున్నాయి.

ఒక “స్పై” మూవీ రిలీజ్ కి ఇంకా తొమ్మిది రోజులే ఉండడం తో ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను కూడా శరవేగంగా జరుపుతున్నారు. లేటెస్ట్ గా “స్పై” ట్రైలర్ గురించి తాజా సమాచారం వచ్చింది. ఈ సినిమా యొక్క ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని అల్లు అర్జున్ థియేటర్ అయిన “AAA సినిమాస్” లో నిర్వహిస్తున్నామని చిత్ర యూనిట్ నుండి సమాచారం అందింది.

- Advertisement -

“స్పై” ట్రైలర్ ని ఉదయం AAA సినిమాస్ లో రిలీజ్ చేసి, ఆ వెంటనే చిత్ర యూనిట్ ర్యాలీలో పాల్గొంటారని టాక్. మరి రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న సమయంలో అన్ని భాషలను తమ ప్రమోషన్లతో కవర్ చేయగలరా లేదా అన్నది చూడాలి. ఏది ఏమైనా చిత్ర యూనిట్ ఈ “స్పై” సినిమా ఫలితంపై స్ట్రాంగ్ గానే ఉన్నారని చెప్పాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు