KGF: యాష్ నెక్స్ట్ సినిమా తొందర్లోనే.. ఈసారి కెజిఎఫ్ కి మించి ?

కెజిఎఫ్ సినిమాతో ఇండియా వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన కన్నడ స్టార్ హీరో యాష్ కొత్త సినిమా పనులు తొందర్లోనే మొదలవ్వనున్నట్టు తెల్సుతోంది. కెజిఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తరువాత యాష్ ఏ సినిమా చేయబోతున్నాడని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నా తరుణంలో అందరి వెయిటింగ్ కి సమాధానం చెప్పేలా ఈ సినిమా ఉండబోతుందని కన్నడ ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది.

బాహుబలి సినిమాతో సౌత్ సినిమాలకు పాన్ ఇండియా మార్కెట్ ఓపెన్ అవడంతో ఫిలిం మేకర్స్ అంత తమ సినిమాని ఇండియా వైడ్ రిలీజ్ చేస్తుండటం జరుగుతూ వచ్చింది. అలా వచ్చిన సినిమాల్లో కెజిఎఫ్ సినిమా కూడా ఒకటి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యాష్ హీరోగా వచ్చిన ఈ సినిమా 2018 డిసెంబర్ లో రిలీజై, బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది.

తెలుగులో ఈ సినిమాని వారాహి చలన చిత్రం బ్యానర్ పై రిలీజ్ చేయగా, ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. బాహుబలి సినిమా తరువాత లాంగ్వేజ్ బారియర్ ని అధిగమించి అన్ని భాషల్లో ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా తరువాత యాష్ ఇప్పటి వరకు ఏ సినిమా కమిట్ అవ్వకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కెజిఎఫ్ సినిమా దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్ ఇప్పటికే ప్రభాస్ తో సలార్ సినిమా రెండు భాగాలుగా తీస్తుండగా, ఈ సినిమా షూటింగ్ కూడా ఫినిష్ అయింది. కానీ హీరో యాష్ సినిమా మాత్రం ఇప్పటి దాక పట్టాలెక్కలేదు.

- Advertisement -

ఇటీవలనే యాష్ కు బాలీవుడ్ నుంచి ఒక క్రేజీ ఆఫర్ వచ్చిన కూడా యాష్ ఆ సినిమాని రిజెక్ట్ చేసి వేరే సినిమా ప్లానింగ్ లో ఉన్నాడు. అయితే యాష్ నెక్స్ట్ సినిమా రావడానికి ఇంకా 4, నుంచి 5 నెలల సమయం పడుతుందని టాక్ నడుస్తుంది. కెజిఎఫ్ సినిమా తరహాలోనే యాష్ నెక్స్ట్ సినిమా కూడా భారీ స్కెల్ లో ఉండబోతుందట. ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ యాష్ కి సెంటిమెంట్ డేట్ రోజున రాబోతుందని సమాచారం. అయితే అది ఎప్పుడన్న విషయంపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు