Thandel : 100 కోట్లు దాటిన బడ్జెట్… నాగ చైతన్యతో రిస్క్ చేస్తున్నారా?

అక్కినేని నాగ చైతన్య తాజా చిత్రం ‘ తండేల్’ బడ్జెట్ చేయి దాటి పోతుందా? చైతూతో నిర్మాతలు రిస్క్ చేస్తున్నారా?

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్. ఫస్ట్ లుక్ తోనే ఈ మూవీపై ప్రేక్షకుల్లో బాగా ఆసక్తి పెరిగింది. మత్స్యకారుల జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ ఇంట్రెస్టింగ్ మూవీలో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. యంగ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న తండేల్ మూవీని టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తన ప్రొడక్షన్ హౌస్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. మూవీని అలా అనౌన్స్ చేసారో లేదో ఇలా హైప్ పెరిగిపోయింది. ఇక ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్ పాత్ర చేస్తుండడంతో మరింత బజ్ క్రియేట్ అయింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. తాజాగా హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో మూవీ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో సినిమాకు అనుకున్న బడ్జెట్ ఒకటని, కానీ ఇప్పుడు అంచనా ప్రకారమే చూసుకున్నా, అనుకున్న దానికంటే బడ్జెట్ చేయి దాటి పోతుందని ఫిలింనగర్ లో టాక్ నడుస్తోంది.

తండేల్ మూవీకి ముందుగా 60 నుంచి 70 కోట్లు బడ్జెట్ గా అనుకున్నారట. కానీ ఇప్పుడు చూసుకుంటే కేవలం అంచనా ప్రకారమే 100 నుంచి 110 కోట్ల దాకా అవుతోందట. అంటే సినిమా పూర్తయ్యేలోపు ఈ బడ్జెట్ మరింతగా పెరిగే అవకాశం ఉంది. దీంతో మిడ్ రేంజ్ బడ్జెట్ మూవీ కాస్తా హై రేంజ్ బడ్జెట్ మూవీగా మారిపోయింది. అయితే నాగ చైతన్య మార్కెట్ చూసుకుంటే మేకర్స్ రిస్క్ చేస్తున్నట్టే. నాగ చైతన్య గత చిత్రం కస్టడీ ఓవరాల్ గా చూసుకుంటే దాదాపు 22 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రమే జరిగింది. అయితే ఆ మూవీ అందులో సగాన్ని కూడా రాబట్టుకోలేకపోయింది. దీంతో నిర్మాతలు భారీగా నష్టాలు చవిచూడగా తప్పలేదు. మరి ఇలాంటి తరుణంలో గీతా ఆర్ట్స్ వారు నాగ చైతన్యపై ఏకంగా 100 కోట్లు పెట్టుబడిగా పెట్టడం పెద్ద రిస్క్ అని చెప్పొచ్చు.

- Advertisement -

ఇక ఇటీవల నాగ చైతన్య, మరో డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ కాంబోలో వచ్చిన దూత ఓటిటిలో రిలీజ్ అయింది. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీని థియేటర్లలో రిలీజ్ చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయాలు కూడా వ్యక్తం అయ్యాయి. ఆడియన్స్ నుంచి ఈ మూవీకి వస్తున్న రెస్పాన్స్, కథపై తమకున్న నమ్మకం వల్లే తండేల్ నిర్మాతలు నాగ చైతన్యతతో 100 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి మరీ మూవీని తీయాలని నిర్ణయించుకున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Gossips, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు