Hi Nanna: కొత్త సినిమా వచ్చినా.. రెండో రోజు నాని జోరు..!

టాలీవుడ్ లో ఈ వారం రెండు సినిమాలు రిలీజ్ అవ్వగా అందులో న్యాచురల్ స్టార్ నాని నటించిన ‘హాయ్ నాన్న‘ కూడా ఒకటి. డిసెంబర్ 7 న రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్ నుండి డీసెంట్ రెస్పాన్స్ ని తెచ్చుకుంది. ఒక ఫీల్ గుడ్ మూవీ గా మౌత్ టాక్ తెచ్చుకున్న హాయ్ నాన్న మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నా ఓపెనింగ్స్ పరంగా యావరేజ్ కలెక్షన్లను ఫస్ట్ డే వసూలు చేసిందని చెప్పొచ్చు. దానికి క్లాస్ సినిమా అనేది ఒక కారణం అయితే, రీసెంట్ గా జరిగిన ఎన్నికల హడావిడి మరో కారణం గా చెప్పవచ్చు.

అయితే హాయ్ నాన్న కి వచ్చిన మౌత్ టాక్ వల్ల రెండో రోజు మాత్రం మంచి జోరును చూపించాడు అని చెప్పాలి. ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా 5.5 కోట్ల షేర్ ని అందుకోగా, రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ హోల్డ్ ని చూపించిందని చెప్పాలి. ఇక దీనికి పోటీగా రిలీజ్ అయిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా పోటీగా రిలీజ్ అయినా, ఈవెనింగ్ షో లకు పుంజుకుని హాయ్ నాన్న మంచి వసూళ్లు సాధించిందని చెప్పొచ్చు.

రెండో రోజు హాయ్ నాన్న తెలుగు రాష్ట్రాల్లో 2.04 కోట్ల షేర్ ని సొంతం చేసుకోగా, వరల్డ్ వైడ్ గా 3.44 కోట్ల షేర్ ని వసూలు చేసింది. ఇక వరల్డ్ వైడ్ గా హాయ్ నాన్న రెండు రోజుల్లో 9.05 కోట్ల షేర్ ని 17.05 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకుంది. అయితే హాయ్ నాన్న 28 కోట్ల టార్గెట్ తో రిలీజ్ అవగా, బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా 19.50 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టాలి. ఇక వీకెండ్ లో హాయ్ నాన్న వసూళ్ళలో అదరగొట్టే అవకాశం ఉందని చెప్పాలి.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు