Hi nanna: ఇక్కడేమో గాని.. అక్కడ ఆల్రెడీ మొదలెట్టేసాడు..

న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘హాయ్ నాన్న‘ సినిమా డిసెంబర్ 7న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. శౌర్యువ్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా పై ఆడియన్స్ లో మాంచి బజ్ ఉంది. ఒక ఫీల్ గుడ్ లవ్ & ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది.

ఇక గత రెండు వారాలుగా టాలీవుడ్ లో పెద్ద సినిమాలు గాని, మీడియం రేంజ్ సినిమాలు గాని రిలీజ్ కాలేదు. ఇప్పుడు వరుసగా ఒక్కరోజు గ్యాప్ లో రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో హాయ్ నాన్న ఒకటి. ఇక ఈ సినిమాకి ఇప్పటికే బుకింగ్స్ స్టార్ట్ అవగా, తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ నార్మల్ గా మొదలయ్యాయి. క్లాస్ సినిమా కావడంతో ఓపెనింగ్స్ యావరేజ్ గా మొదలయ్యాయి. కానీ సిటీ ఏరియాల్లో బుకింగ్స్ జోరు సూపర్ గా ఉంది.

ఇదిలా ఉండగా ఓవర్సీస్ లో మాత్రం హాయ్ నాన్న జోరు ఇప్పటికే మొదలైంది. సినిమా రిలీజ్ కి ముందే ప్రీమియర్ షో బుకింగ్స్ 2 లక్షల డాలర్లు దాటింది. మామూలుగానే నాని సినిమాలకి ఓవర్సీస్ లో డిమాండ్ చాలా ఎక్కువ. ఇప్పటికే నాని ఖాతాలో 1 మిలియన్ డాలర్ సినిమాలు ఎనిమిది ఉన్నాయి. ఇక ఇప్పుడు మరో క్లాస్ సినిమాతో ఓవర్సీస్ ఆడియన్స్ ని మెప్పించడానికి వస్తున్నాడు. జరుగుతున్న బుకింగ్స్ ని బట్టి మరో మిలియన్ డాలర్ సినిమా నాని ఖాతాలో పడడం గ్యారెంటీ అనిపిస్తుంది. టాక్ బాగుంటే హాయ్ నాన్న ఓవర్సీస్ నుండే 10 కోట్లు పిండుకునే ఛాన్స్ ఉంది.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు