Kollywood: సినిమాలు మానేసి.. కోట్లు సంపాదిస్తున్న కోలీవుడ్ హీరో..ఎవరంటే..?

సాధారణంగా చాలామంది డబ్బులు సంపాదించడానికి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు అయితే మరి కొంతమంది ఇండస్ట్రీలోకి వచ్చి ఇక్కడ చాలీచాలని రెమ్యునరేషన్ తో కుటుంబాన్ని పోషించలేక.. సినిమాలు మానేసి ఇప్పుడు వ్యాపారాలు చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. అలాంటివారిలో ప్రముఖ కోలీవుడ్ హీరో అరవింద స్వామి కూడా ఒకరు అని చెప్పాలి. బొంబాయి , రోజా వంటి సినిమాలతో ప్రేక్షకులను హీరోగా మెప్పించిన ఈయన ఆ తర్వాత విలన్ గా కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇకపోతే ప్రముఖ నటుడి గానే కాకుండా విజయవంతమైన వ్యాపారవేత్తగా కూడా మంచి పేరు దక్కించుకున్నారు.

1991లో మణిరత్నం దళపతి సినిమాతో అరవిందస్వామి సినీ ప్రయాణం మొదలైంది . 1992లో వచ్చిన రోజా 1995లో వచ్చిన బొంబాయి సినిమాలు ఈయనకు మంచి పేరు తీసుకొచ్చాయి. ఆ తర్వాత ఈయన చేసిన సినిమా లేవి బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో 2000వ సంవత్సరంలో నటన నుంచి తప్పుకున్నారు. ఇక మొదట తన తండ్రికి చెందిన వీడి స్వామి అండ్ కంపెనీ వ్యాపారాలను చూసుకోవడం మొదలుపెట్టిన ఈయిన ఆ తర్వాత 2005లో మరో అడుగు ముందుకేసి టాలెంట్ మాగ్జిమస్ అనే పేరోల్ ప్రాసెసింగ్ , టెంపరరీ వర్కర్స్ అందించే సేవల కంపెనీని ప్రారంభించి సక్సెస్ అయ్యారు.

ఆ తర్వాత ఈయన ఆధ్వర్యంలోనే ఆ కంపెనీ మంచి వృద్ధిని అందుకుంది . అలా ఒక సినీ నటుడిగా కెరియర్ను ప్రారంభించి చివరిగా వ్యాపారవేత్తగా సక్సెస్ అయ్యారు. 2022 నాటికి అరవింద స్వామి ఆధ్వర్యంలో టాలెంట్ మాగ్జిమస్ కంపెనీ అక్షరాల రూ.3,300 కోట్లు ఆదాయాన్ని అందించింది. అంతేకాదు ఇది ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగా ఆయన పేరును మరింత పటిష్టం చేసింది. కెరియర్ సవాళ్లను ఎదుర్కొంటున్న నటుడు స్థాయి నుంచి విజయవంతమైన వ్యాపారవేత్తగా ఈ అద్భుతమైన పరివర్తన అరవింద స్వామి యొక్క బహుమఖ ప్రజ్ఞను హైలైట్ చేస్తాయని చెప్పవచ్చు. ఇకపోతే తన నటన జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటన్నింటినీ వ్యాపార ప్రపంచంలో దాటేసారు అనే చెప్పాలి. ప్రస్తుతం తన ప్రయాణాన్ని వెండితెరను దాటి వ్యాపారం వైపు మార్చి విజయానికి కొత్త అద్దం పట్టింది అని చెప్పవచ్చు. ఏది ఏమైనా సినిమాల ద్వారా సంపాదించలేని డబ్బును ఆయన వ్యాపారాల ద్వారా సక్సెస్ అయ్యి సాధించి చూపించారు.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు