Dunki Trailer : షారుక్ రాంగ్ స్టెప్… ‘సలార్’ను బీట్ చేసే ఛాన్స్ మిస్

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తాజా చిత్రం “డుంకి”. బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన ఈ మూవీ కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. నలుగురు స్నేహితుల మధ్య 1995 లో జరిగిన పలు సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. చూసినంత సేపు ప్రేక్షకుల ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తోంది. అయితే ఈ ట్రైలర్ చూశాక సినీ విశ్లేషకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. షారుక్ రాంగ్ స్టెప్ తీసుకున్నాడు అంటూ పెదవి విరుస్తున్నారు. దానికి కారణం లేకపోలేదు. ఇంతకీ షారుక్ తీసుకున్న రాంగ్ స్టెప్ ఏంటంటే…

షారుక్ ఖాన్ కు ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా మంచి ఇమేజ్ ఉంది. పఠాన్, జవాన్ వంటి భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలతో సౌత్ లో సైతం ఆయన స్టార్ గా మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ ను, క్రేజ్ ను సంపాదించుకున్నారు. నిజానికి షారుక్ కు ఎప్పటి నుంచో సౌత్ లోనూ మంచి ఫ్యాన్ బేస్ ఉంది. కానీ బాలీవుడ్ రేంజ్ లో సౌత్ మార్కెట్ లేకపోవడంతో ఆయన ఎప్పుడూ ఇక్కడ దృష్టి పెట్టలేదు. కానీ ఇటీవల కాలంలో టాలీవుడ్ స్పాన్ పెరగడంతో మన సత్తా ఏంటో వాళ్లకు తెలిసి వచ్చింది. దీంతో రీసెంట్ గా తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో షారుక్ చేసిన ‘జవాన్’ మూవీని పాన్ ఇండియా మూవీగా అన్ని భాషల్లోనూ విడుదల చేశారు. అలాగే అన్ని భాషల నుంచి ప్రేక్షకులు షారుక్ ‘జవాన్’కు బ్రహ్మరథం పట్టారు.

ఈ నేపథ్యంలో పాన్ ఇండియా స్టార్ ఎవరు అనే ప్రశ్న తలెత్తింది. ఒకవైపు ప్రభాస్ కూడా వరుసగా సినిమాలు చేస్తూ బాలీవుడ్లో ఏ హీరోకు లేనంత క్రేజ్ ను సంపాదించుకొని ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్టార్ గా కొనసాగుతూ ఉండడమే అందుకు కారణం. ఇలాంటి క్రమంలో ప్రభాస్ నటించిన ‘సలార్’, అలాగే షారుక్ కొత్త చిత్రం ‘డుంకి’ ఒకేసారి విడుదలకు సిద్ధమవడం ఇండస్ట్రీని షేక్ చేసింది. అయితే ఇక్కడే షారుక్ రాంగ్ స్టెప్ తీసుకున్నాడు. “డుంకి” మూవీని కేవలం హిందీలోనే రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. అద్భుతమైన కంటెంట్ ఉన్న ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషల్లో రిలీజ్ చేయాల్సింది. ప్రస్తుతం “సలార్’ ట్రైలర్ కు నెగిటివ్ టాక్ నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ‘సలార్’ మూవీకి ఏమాత్రం నెగటివ్ టాక్ వచ్చినా “డుంకి”తో షారుక్ ఖాన్ దూసుకువెళ్లి పోయే అవకాశం ఉంది. అలా ప్రభాస్ తో పోటీపడి నెంబర్ వన్ హీరోగా నిలదొక్కుకునే అవకాశం ఉంటుంది షారుక్ కి. కానీ ఆయన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా “డుంకి” సినిమాను కేవలం హిందీలోనే రిలీజ్ చేస్తుండడం గమనార్హం. “డుంకి”మూవీ డిసెంబర్ 21న, “సలార్” మూవీ డిసెంబర్ 22న రిలీజ్ కాబోతున్నాయి.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు