Amar Deep: స్పా బ్యాచ్ లో చిచ్చు.. ఈ అమర దీపానికి అలక పాన్పే కావాలా ఏంటీ?

బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం నామినేషన్ ప్రాసెస్ తరువాత అన్నీ ఎంటర్టైన్మెంట్ టాస్క్ లే పెడుతున్నాడు బిగ్ బాస్. ఇక ఈ టాస్క్ లో విన్ అయిన వాళ్ళకి కూడా పెద్దగా విలువైన గిఫ్ట్ లేవి ఉండవు. ఇక ఈ వారం నామినేషన్ లో మాత్రం అందరి మధ్య గొడవ కాస్త పెద్దదిగా జరిగిందన్న విషయం షో చూసిన వాళ్లకి అర్థమైపోతుంది.

ఇదిలా ఉండగా బిగ్ బాస్ హౌస్ లో అమర్ దీప్ చేష్టలకి హద్దు లేకుండా పోతుంది. ఈ మధ్య ప్రతి విషయానికి అలుగుతున్నాడు. ప్రతి టాస్కులో చివరి దాకా వచ్చి ఓడిపోతున్నందుకు అమర్ దీప్ జాలి పడాలో, లేక టాస్కుల్లో ఎవరు నామినేట్ చేసినా, కాస్త సపోర్ట్ చేయకున్నా అలాగుతున్నందుకు నవ్వాలో తెలియక ఆలోచిస్తున్నారు.

లేటెస్ట్ గా స్పా బ్యాచ్ లోనే చిన్న చిచ్చు రేగింది. టాస్క్ అయిపోయిన తర్వాత అలా ఖాళీగా కూర్చున్న ఈ ముగ్గురు, సరదాగా టెడ్డి తో ఆడుతుంటే ఒక్కసారిగా అమర్ బొమ్మ విసిరేసాడు. ముక్కు మీద కొడతావేంటి అని సీరియస్ అయ్యాడు. దాంతో శోభా, ప్రియాంక సీరియస్ గా అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అమ్మాయి అలిగినట్టు ప్రతి సారి ఈ అమర్ అమ్మాయిలా అలుగుతున్నాడేంటి అంటూ కామెంట్స్ చేషున్నారు.

- Advertisement -

మరి కొందరు అమర్ దీప్ అలిగిన ప్రతిసారి అలక పాన్పు పై పడుకోబెట్టి బుజ్జగించాలా ఏంటి? అంటూ ట్రోల్ చేస్తున్నారు. అయితే స్పా బ్యాచ్ లో ప్రియాంక అమర్ ని నామినేట్ చేసినపుడే చిచ్చు మొదలైందని ఆడియన్స్ ఊహించారు. అది మనసులో పెట్టుకున్న అమర్ ఇంకా మర్చిపోలేక ప్రియాంక పై సీరియస్ అవుతున్నాడని ప్రియాంక ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా బిగ్ బాస్ ఎండ్ అయ్యే టైం లో అమర్ దీప్ ఇలా అందరితో వాగ్వాదానికి దిగడం తన ఎలిమినేషన్ కి కారణం అయ్యే ఛాన్స్ ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు