Hi Nanna First Review: “హాయ్ నాన్న” ఫస్ట్ రివ్యూ

ఎమోషనల్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ “హాయ్ నాన్న” మూవీ డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. నేచునల్ స్టార్ నాని, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి కొత్త దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా విడుదలకు మరొక రోజు మాత్రమే మిగిలి ఉండడంతో నాని ఫ్యాన్స్ అంతా ఎంతో ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే తాజాగా “హాయ్ నాన్న” మూవీ ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చింది. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ పూర్తి కాగా, సెన్సార్ సభ్యులు సినిమా ఎలా ఉంది అన్న విషయాన్ని బయటపెట్టారు. రెండున్నర గంటల రన్ టైం ఉన్న “హాయ్ నాన్న” మూవీకి సంబంధించి సెన్సార్ సభ్యులు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సినిమా స్క్రీనింగ్ సమయంలో కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు సెన్సార్ బోర్డు సభ్యులను కన్నీళ్లు పెట్టించాయట. సినిమాలో నాని, ఆయన కూతురికి మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు సెన్సార్ బోర్డు సభ్యుల మనసును కదిలించాయట. ఆద్యంతం మృదువుగా సాగుతూ, ఆకట్టుకునే కథతో వస్తున్న “హాయ్ నాన్న” మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చడం ఖాయం అంటున్నారు. ఇక సినిమాలో ముఖ్యంగా ఇంటర్వెల్, గ్రిప్పింగ్ క్లైమాక్స్ అద్భుతంగా ఉన్నాయట. సినిమాకు వెళ్లిన ప్రేక్షకులను ఎమోషనల్ సన్నివేశాలు తప్పకుండా కన్నీళ్లు పెట్టించడమే కాకుండా ఆలోచింపజేస్తాయని అంటున్నారు.

ఇక సమయానకూలంగా వచ్చే పాటలు, స్క్రీన్ ప్లే మ్యాజిక్ తో పాటు నాని అద్భుతమైన యాక్టింగ్ సినిమాకు ప్లస్ పాయింట్లు అని చెబుతున్నారు. అయితే ఇందులో ఎక్కడా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించిన ప్రస్తావన రాకపోవడం గమనార్హం. ఇక నాని కూతురుగా నటించిన కియారా ఖన్నా గురించి కూడా ప్రస్తావిస్తూ ఆ పాపపై ప్రశంసలు కురిపించారు. కాగా శృతిహాసన్ ‘ఒడియమ్మ’ అనే ప్రత్యేక పాటలో కనిపించనున్న విషయం తెలిసిందే.

- Advertisement -

ఈ సినిమాపై ఇప్పటికే ఉన్న క్రేజ్ ను ఈ సెన్సార్ టాక్ మరింత పెంచుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇప్పటికే నాని అప్లై చేసిన ప్రత్యేకమైన ప్రమోషనల్ ఐడియాలు ప్రేక్షకులకు సినిమాపై ఆసక్తిని పెంచి, ఎప్పుడెప్పుడు మూవీ రిలీజ్ అవుతుందా అని ఎదురు చూసేలా చేశాయి. ఇప్పుడు సెన్సార్ బోర్డు సభ్యులు ఇచ్చిన రివ్యూ “హాయ్ నాన్న” మూవీపై అంచనాలను మరింత రెట్టింపు చేసింది. మరి “హాయ్ నాన్న” మూవీ ప్రేక్షకుల అంచనాలను ఎంత వరకు అందుకుంటుందో చూడాలి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు