Prabhas : గురూజీకి డార్లింగ్ కాస్ట్లీ గిఫ్ట్… ఏమిచ్చాడో తెలుసా?

ప్రభాస్ గురించి చాలామంది స్టార్స్ ఎన్నో చెప్పుకోచ్చారు. ఇప్పటిదాకా ప్రభాస్ మంచితనం, ఆయన గొప్పదనం గురించి ఎంతోమంది పొగడగా విన్నాం చూసాం. అయితే ఆయన డౌన్ టు ఎర్త్ అనడానికి తాజాగా జరిగిన సంఘటనే నిదర్శనంగా చూపిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఈరోజు తాను పాన్ ఇండియా స్టార్ గా ఎదగడానికి కారణమైన తన గురువుకు మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చి మరోసారి వార్తల్లో నిలిచారు ప్రభాస్.

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. టాలీవుడ్ లో చిన్న సినిమాలతో స్టార్ట్ చేసిన ప్రభాస్ ఇప్పుడు ఏకంగా 150 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటూ ఇండియాలోనే నెంబర్ వన్ స్టార్ గా మారిపోయాడు. అయితే ఎంత ఎత్తుకు ఎదిగినా తన మూలాలను మాత్రం మర్చిపోలేదు ఆయన. తాజాగా తన నట గురువు సత్యానంద్ పుట్టినరోజు సందర్భంగా షాకింగ్ గిఫ్ట్ ఇచ్చి ఆయనను ఆశ్చర్యపరిచాడు. ప్రభాస్ కు నటన నేర్పిన గురువు పేరు సత్యానంద్. కేవలం ప్రభాస్ కు మాత్రమే కాకుండా చిరంజీవి దగ్గర నుంచి ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న ఎంతోమంది యంగ్ స్టార్స్ వరకు అందరూ సత్యానంద్ శిష్యులే. అలా ప్రభాస్ కూడా సత్యానంద్ దగ్గర నటనలో శిక్షణ తీసుకుని కృష్ణంరాజు వారసుడిగా ‘ఈశ్వర్’ సినిమాతో తెరంగ్రేటం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పలు సినిమాలలో నటించి తన టాలెంట్ తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ తనకు లైఫ్ ఇచ్చిన గురువును మాత్రం మర్చిపోలేదు.

ఆయన పుట్టినరోజు ను గుర్తు పెట్టుకుని మరీ ఏకంగా పూర్తిగా బంగారంతో తయారు చేసిన చేతి వాచ్ ను సత్యానందుకు గిఫ్ట్ గా ఇచ్చి సంభ్రమాశ్చర్యాలకు గురి చేశాడు. అంతేకాకుండా తాను స్టార్ హీరో కాబట్టి ఎవరితోనైనా బహుమతి పంపిస్తే సరిపోతుంది అని భావించకుండా, తానే స్వయంగా సత్యానంద్ ఇంటికి వెళ్లి ఆప్యాయంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి చేతికి బంగారు వాచీ తొడిగారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా, ఆ పిక్స్ చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎవరు ఎలాంటి స్థాయిలో ఉన్నప్పటికీ వారు స్టార్ట్ అయిన పాయింట్ మాత్రం మర్చిపోకూడదు అనే బేసిక్ ను ప్రభాస్ బాగా గుర్తు పెట్టుకున్నాడు. ఇక ప్రస్తుతం ప్రభాస్ సలార్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ప్రభాస్ నటించిన మూడు పాన్ ఇండియా సినిమాలు వరుసగా ఆయనను డిజాస్టర్ లతో నిరాశ పరచడంతో ఈ మూవీపైనే ప్రభాస్ ఆశలన్నీ పెట్టుకున్నాడు.

- Advertisement -

Check Filmify for the Latest movie news in Telugu and updates from all Film Industries. Also, get the latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు