Dunki Trailer : రాజ్ కుమార్ హిరానీకి సౌత్ అంటే ఎందుకంత అసూయ?

రాజ్ కుమార్ హిరానీ… ఈ డైరెక్టర్ కు బాలీవుడ్ లో ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఇతనితో సినిమాలు చేయడానికి స్టార్ హీరో హీరోయిన్లు సైతం తహతహలాడుతుంటారు. తాజాగా హిరానీ దర్శకత్వం వహించిన ‘డుంకి’ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. షారుక్ ఖాన్ హీరోగా, తాప్సి హీరోయిన్ గా, విక్కీ కౌశల్, అనిల్ గ్రోవర్, విక్రమ్ కొచ్చర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న డుంకి మూవీ 1995లో పంజాబ్ లోని లాల్టు అనే చిన్న పట్టణంలో జరిగిన కథ ఆధారంగా తెరకెక్కింది. ఈ నలుగురు స్నేహితులు లండన్ కి వెళ్లాలనుకుంటారు. అయితే ఇంగ్లీష్ రాకపోవడంతో కోచింగ్ సెంటర్ లో చేరుతారు. అనంతరం వారు లండన్ కి ఎలా వెళ్లారు? ఆ ప్రయాణంలో ఏం జరిగింది అనే అంశాలపై ఆసక్తిని పెంచేసింది తాజాగా విడుదలైన ‘డుంకి’ ట్రైలర్. అయితే మేకర్స్ ఈ మూవీని కేవలం హిందీలో మాత్రమే రిలీజ్ చేస్తుండడం గమనార్హం.

నిజానికి షారుఖ్ ఖాన్ కు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అలాగే ‘జవాన్’ తర్వాత షారుఖ్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. మరి ఇలాంటి సమయంలో డుంకి సినిమాను కేవలం హిందీలోనే రిలీజ్ చేస్తుండడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ట్రైలర్ ను కేవలం హిందీలోనే రిలీజ్ చేయడంతో టాలీవుడ్ లో ఉన్న షారుక్ అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దీనంతటికీ కారణం హిరానీనే అంటూ మండిపడుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండియన్ మూవీ హిస్టరీలో ఓ చరిత్రను సృష్టిస్తోందని, టాలీవుడ్ డైరెక్టర్స్, హీరోలు పాన్ ఇండియా లెవెల్ లో సత్తా చాటుతుండడాన్ని బాలీవుడ్ బడా డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ జీర్ణించుకోలేకపోతున్నారని అనడానికి ఇదే ఉదాహరణ అని టాలీవుడ్ సినీ ప్రియులు ఫైర్ అవుతున్నారు. కొంతవరకు ఇది నిజమేనని చెప్పాలి.

సౌత్ కు సంబంధించిన డైరెక్టర్స్ గాని, హీరోలు గాని మంచి అద్భుతమైన సినిమాలు తీసినప్పుడు ఈ బాలీవుడ్ మేకర్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉండదు. ఇక బాహుబలి తర్వాత బాలీవుడ్ పరిస్థితి పాతాళానికి పడిపోవడం వీరికి మింగుడు పడడం లేదు అనేది అక్షర సత్యం. రీసెంట్ గా వచ్చిన ‘యానిమల్’ మూవీ ఆ రేంజ్ లో హిట్ అయినప్పటికీ బాలీవుడ్ నుంచి ఒక్క డైరెక్టర్ గానీ, ప్రొడ్యూసర్ గానీ సినిమాను ప్రశంసిస్తూ ఒక్క ట్వీట్ కూడా వేయలేదు. పైగా ఇప్పుడు షారుక్ లాంటి క్రేజీ హీరో సినిమాను కేవలం హిందీలోనే రిలీజ్ చేస్తుండడం టాలీవుడ్ ఆడియన్స్ కు మరోసారి కోపాన్ని తెప్పించింది. మరి హీరాని ఈ నిర్ణయానికి కారణం ఏంటో అతనికే తెలియాలి. నిజానికి సౌత్ లో కూడా ఈ మూవీని రిలీజ్ చేస్తే బాగానే క్యాష్ చేసుకోవచ్చు. వీళ్లకు పోటీగా నిలుస్తుంది మరో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. కానీ ‘సలార్’ ట్రైలర్ పై ఇప్పటికే నెగటివ్ టాక్ నడుస్తోంది. అది ‘డుంకి’ మేకర్స్ కు కలిసి వచ్చే అంశం. అయినప్పటికీ హిరానీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం టాలీవుడ్ ఆడియన్స్ ఎవరికీ నచ్చడం లేదు. అందుకే ఈ బాలీవుడ్ మేకర్స్ టాలీవుడ్ అంటే అసూయ పడుతున్నారు అని కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు