Biggboss captain: నాగార్జున దయ వల్ల అమర్ దీప్ కెప్టెన్ కల నెరవేరింది..

బిగ్ బాస్ సీజన్ 7 లో అమర్ దీప్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టినప్పటి నుండి అన్ని గేమ్స్ లో బాగా ఆడతాడని తెలిసిందే. ప్రతి టాస్క్ లో ఎలా ఆడినా, లక్ లేకో, ఫౌల్ గేమ్ వల్లో ఓడిపోతూ ఉంటాడు. ఇక అడపాదడపా చిన్న చిన్న టాస్కుల్లో గెలవడం తప్ప ఇప్పటివరకు అమర్ దీప్ ఏ టాస్క్ లో కూడా గెలవలేదు. పైగా నామినేషన్స్ లో కూడా చాలా సార్లు చేసిన వాళ్లనే చేసి ట్రోలింగ్ కి గురయ్యాడు.

అయితే అమర్ దీప్ చాలా రోజుల నుండి కెప్టెన్ కావాలని కలలు కన్నాడని ఆడియన్స్ కి కూడా తెలుసు. ఇక కెప్టెన్సీ టాస్కుల్లో కూడా రెండు సార్లు చివరి దాకా వచ్చి లాస్ అయ్యాడు. లేటెస్ట్ గా ఫినాలే పవర్ అస్త్ర టాస్క్ కూడా చివరి దాకా వచ్చి కొద్దిలో మిస్ అయ్యాడు. అయితే ఏదేమైనా అమర్ దీప్ కష్టానికి తగ్గ ప్రతిఫలం వల్లో, అలాగుతాడనో నాగార్జున అమర్ కల నెరవేర్చాడు. అదే కెప్టెన్ కావాలనే కల.

ఫినాలే పవర్ అస్త్ర టాస్క్ లో అమర్ చూపించిన పెర్ఫార్మన్స్ వల్ల నాగార్జున అమర్ దీప్ ని ఈ వారం కెప్టెన్ ని చేసేసాడు. ఈ మాట నాగ్ నోటి నుండి రాగానే అమర్ సంతోషం అంతా ఇంతా కాదు. ఫైనల్ కి వచ్చినంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అయితే తనకి డిప్యూటీస్ మాత్రం ఉండరు అన్న విషయం కూడా నాగ్ చెప్పడం జరిగింది. ఇక ఈ వారం నాగార్జున ఫినాలే అస్త్ర టాస్క్ లో సరిగా ఆడని వాళ్ళని ప్రశ్నలతో ఇప్పటికే కడిగిపడేసాడన్నది తెలిసిందే.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు