Biggboss season7: శివాజీని నిలిదీసినట్టు.. ప్రియాంకని కూడా అలాగే అడగొచ్చుగా..! – నాగార్జున

స్టార్ మా లో టెలికాస్ట్ అవుతున్న బిగ్ బాస్ సీజన్ 7 మరో రెండు వారాల్లో ముగుస్తుందన్న విషయం తెలిసిందే. అయితే ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో ఫినాలే అస్త్ర టాస్క్ జరగగా, ఆ టాస్క్ లో అంబటి అర్జున్ విన్ అయ్యి, ఫస్ట్ ఫైనలిస్ట్ గా నిలిచాడు. అయితే ఈ టాస్క్ గెలవడం కోసం ఎనిమిది మంది మధ్య పోటీ గట్టిగానే జరిగింది. అలాగే ఈ టాస్క్ లో గ్రూపిజం గేమ్ తో పాటు, కొన్ని మనస్పర్థలు కూడా జరిగాయన్న సంగతి తెల్సిందే.

అయితే ఆ పాయింట్స్ పై వీకెండ్ షో లో వచ్చిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పై ఒక్కొక్కరిని లేపి కడిగేస్తున్నాడు. అలా గౌతమ్, ప్రియాంక చేసిన తప్పుల్ని కూడా చూపెట్టాడు. ఈ టాస్క్ లో అమర్ అలిగాడని ప్రియాంక, గౌతమ్ కి చెప్పి తన పాయింట్స్ ని అమర్ కోసం ఇప్పించిందని తెలిసిందే.

అయితే ఈ విషయంపై నాగార్జున ప్రియాంక ని ప్రశ్నిస్తూ గౌతమ్ ఎవరికైనా ఇవ్వొచ్చు, మధ్యలో ఎందుకు కలగజేసుకున్నావు, గ్రూపిజం చేస్తున్నావా అన్నాడు. అలాగే గౌతమ్ ని కూడా ప్రశ్నిస్తూ చాలా సార్లు ఫెయిర్ గేమ్ ఆడుతున్నడని, గ్రూపిజం చూపిస్తున్నాడని, అలాగే ఇద్దరికీ మాత్రమే శివాజీ సపోర్ట్ చేస్తున్నాడని చాలా సార్లు శివాజీని నిందించావు.. మరి అలాగే అమర్ కి ఫేవర్ ఎందుకు చేస్తున్నావు, అని ప్రియాంక ని ఎందుకు ప్రశ్నించేలేదు అని నాగార్జున స్మూత్ గా చురకనంటించాడు.

- Advertisement -

చూడ్డానికి ఇది చిన్న ఇష్యూ లా కనిపించినా, బిగ్ బాస్ బిగినింగ్ డేస్ నుంచి లెక్కేస్తే ఇది చాలా పెద్ద మ్యాటర్. ఎందుకంటే ఈ షో మొదలైనప్పటి నుండి బిగ్ బాస్ లో అమర్ దీప్, ప్రియాంక, శోభా శెట్టి గ్రూప్ గేమ్ ఆడారు. అదే పాయింట్ చాలా రోజులకు నాగార్జున ప్రశ్నించారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు