Nani: నాని ఫ్యాన్స్ కి శుభవార్త..ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇవే..!

నేచురల్ స్టార్ హీరో నాని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా దూసుకుపోతున్నారు. హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఒక దాని తర్వాత మరొకటి ప్రకటిస్తూ అభిమానులకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు హీరోగా మరొకవైపు నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టిన ఈయన ఎక్కువగా తమిళ్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరిస్తూ క్యాష్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. అంతేకాదు పలు తెలుగు చిత్రాల నిర్మాణంలో కూడా భాగమవుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా నాని నటింటిన హాయ్ నాన్న మూవీ డిసెంబర్ 7 వ తేదీన విడుదల కానున్న నేపథ్యంలో.. తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి కూడా అభిమానులతో పంచుకున్నారు.

మరి నాని ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం సరిపోదా శనివారం.. విజిలెంట్ చిత్రమైన ఈ సినిమా ఒక షెడ్యూల్ ని ఇప్పటికే పూర్తి చేసుకుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేసి.. వెంటనే మరో ప్రాజెక్టును ప్రకటించబోతున్నారు. అంతేకాదు ఆ ప్రాజెక్టుకు సంబంధించి స్క్రిప్ట్ కూడా ముగింపు దశలో ఉన్నట్లు సమాచారం. ఇక దీని తర్వాత దసరా సినిమాతో భారీ పాపులారిటీ దక్కించుకున్న డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు నాని. శ్రీకాంత్ ఓదెలతో సినిమాని ప్రకటించగానే అందరి అంచనాలు అప్పుడే పెరిగిపోయాయి. దసరా సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న శ్రీకాంత్ నాని కాంబో ఇప్పుడు ఎలాంటి సినిమాతో వస్తారని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

మరొకవైపు హిట్ సినిమాల సీక్వెన్స్ హిట్ 3 కూడా రాబోతోంది. ఇందులో నాని నటించబోతున్నట్లు హిట్ 2 క్లైమాక్స్లో రివీల్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ.. భవిష్యత్తులో నేను చేసే సినిమాలలో చాలావరకు యాక్షన్ , మాస్ చిత్రాలే ఉంటాయి. అయితే ప్రతి ఒక్కటి ఒకదానికొకటి భిన్నంగా ఉంటుందే తప్ప నేను తీసే సినిమాలలో మాస్, యాక్షన్ సన్నివేశాలు మళ్లీ పునరావృతం కాకుండా చూసుకుంటాను అంటూ తెలిపారు నాని . మొత్తానికైతే తాను ఎంచుకున్న ప్రతి ప్రాజెక్టు కూడా ఒకదానికొకటి భిన్నంగా ఉండబోతుందని వెల్లడించి అభిమానులలో కొత్త ఆశలు నింపారు నాని. మరి ఈ ప్రాజెక్టులతో ఆయన ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు