Sheela Raj Kumar: విడాకులు తీసుకున్న బిచ్చగాడు 2 నటి..అందుకే అంటూ..!

ఈమధ్య కాలంలో సినీ సెలబ్రిటీలు ఎప్పుడు ఏ విషయాన్ని ఏ విధంగా చెబుతారో తెలియక అభిమానుల సైతం తికమక పడుతున్నారు . కొంతమంది ప్రేమ , పెళ్లి అంటూ శుభవార్తలు చెబుతుంటే మరి కొంతమంది విడాకులు అంటూ అభిమానులకు పూర్తిస్థాయిలో నిరాశ మిగులుస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరొక హీరోయిన్ విడాకులు తీసుకొని అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక ఆమె ఎవరో కాదు బిచ్చగాడు 2 సినిమాలో సిస్టర్ గా నటించిన షీలా రాజ్ కుమార్. కోలీవుడ్ లో చాలా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించిన షీలా తాజాగా సోషల్ మీడియా ద్వారా తన భర్తతో విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించింది.

కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఈమె తెలుగు సినిమా ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. కానీ కోలీవుడ్ లో మాత్రం చాలా సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ద్రౌపది , మండేలా, టూ లెట్ వంటి సినిమాలలో నటించిన ఈమె రీసెంట్గా వచ్చిన లారెన్స్, ఎస్.జె.సూర్య నటించిన జిగర్తాండ డబుల్ ఎక్స్ లో కూడా నటించింది. అంతేకాదు విజయ్ ఆంటోనీ నటించిన బిచ్చగాడు 2 సినిమాలో కూడా విజయ్ కి సిస్టర్ పాత్రలో నటించింది. ఇక షీలా నటించిన టూ లెట్ సినిమాతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న ఈమె ఈ సినిమాకు గాను నేషనల్ అవార్డు కూడా లభించింది.

మరోవైపు తమిళ, మలయాళ భాషల్లో ఎన్నో అవకాశాలు అందుకున్న షీలా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలలో మాత్రమే నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఇక ఈమె యాక్టింగ్ స్కూల్ నడిపిస్తున్న చోళన్ ను వివాహం చేసుకుంది. ఇకపోతే వివాహం తర్వాత ఎంతో సంతోషంగా గడిపిన ఈమె అనుకోకుండా ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో వైవాహిక జీవితానికి పుల్ స్టాప్ పెడుతున్నట్టు తాజాగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఇకపోతే సోషల్ మీడియా ద్వారా తానూ చోళన్ విడిపోతున్నట్టు ప్రకటించి..చివరిలో థాంక్యూ చోళన్ అంటూ రాసుకొచ్చింది. అయితే ఎందుకు తన భర్తతో విడిపోతోందో అన్న విషయాన్ని మాత్రం తెలుపలేదు. కేవలం కారణాలు చెప్పకుండా విడిపోతున్నట్టు మాత్రమే ప్రకటించింది షీలా.. ఇక ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు