Prabhas: ఆల్ టైం రికార్డు సెట్ చేసిన ‘సలార్’.. ఇది మామూలే..

డిసెంబర్ 22న రిలీజ్ అవుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ పాన్ ఇండియా మూవీ “సలార్” యొక్క థియేట్రికల్ ట్రైలర్ డిసెంబర్ 1న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబో లో వస్తున్న ఈ సినిమాపై అభిమానులతో పాటు, కామన్ ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే ట్రైలర్ కూడా ఫ్యాన్స్ కి నెక్స్ట్ లెవెల్ థ్రిల్ ని కలుగచేసింది. అయితే ట్రైలర్ టేకింగ్ చూస్తే ప్రశాంత్ నీల్ రెగ్యులర్ మూవీస్ టేకింగ్ లా కాస్త ఉండడం వల్ల కొందరు కామన్ ఆడియన్స్ డిసప్పాయింట్ అయ్యారు.

అయినా ఓవరాల్ గా సలార్ ట్రైలర్ బాగుందని చెప్పొచ్చు. ఇక సలార్ రిలీజ్ అయిన 24 గంటల్లో ఆల్ టైం రికార్డ్ సెట్ చేసి పడేసింది. ముఖ్యంగా తెలుగులో డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్ బేస్ కి తగ్గట్టు, సలార్ ట్రైలర్ రిలీజ్ అయిన సెకండ్స్ నుండే, అలా… రికార్డులు బ్రేక్ అయిపోయాయి.

తాజాగా సలార్ ట్రైలర్ తెలుగులో వ్యూస్ పరంగా 24 గంటల్లో ఆల్ టైం రికార్డ్ సెట్ చేసాడు. రిలీజ్ అయిన 24 గంటల్లో సలార్ తెలుగు ట్రైలర్ 32.58 మిలియన్ల వ్యూస్ తెచ్చుకోగా, అంతకు ముందున్న సర్కారు వారి పాట(26.33) ట్రైలర్ ని 18 గంటల్లో బ్రేక్ చేసింది.

- Advertisement -

ఇక లైక్స్ పరంగా కూడా రికార్డు లెవెల్లో లైక్స్ రాగా, 24 గంటల్లో సలార్ 1.23 మిలియన్ లైక్స్ ని కొట్టి, ఫస్ట్ ప్లేస్ లో ఉన్న RRR (1.24M) లైక్స్ ని కొద్దిలో మిస్ అయింది. ఇక సలార్ ట్రైలర్ రిలీజ్ అయిన 24 గంటల్లో అన్ని భాషల్లో కలిపి 116 మిలియన్ల వ్యూస్ ని, ఇంకా 2.7 మిలియన్ల లైక్స్ ని సొంతం చేసుకుంది.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు