Shankar: గేమ్ చేంజర్ గురించి దిల్ రాజు కే క్లారిటీ లేదు , ఇంకా ఆడియన్స్ కి ఏమి చెబుతారు.

జెంటిల్మెన్ సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు శంకర్. శంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శంకర్ చేసిన సినిమాలు తమిళ్ తో పాటు తెలుగులో కూడా అప్పట్లో డబ్బింగ్ అయ్యాయి. ప్రేమికుడు, భారతీయుడు, జీన్స్ వంటి ఎన్నో సినిమాలు శంకర్ కి ఒక కల్ట్ స్టేటస్ను తీసుకొని వచ్చాయి. శంకర్ దర్శకత్వంలో సినిమా చేయడానికి స్టార్ హీరోలు కూడా వెయిట్ చేసే రోజులు కూడా ఉన్నాయి.

శంకర్ దర్శకత్వంలో సినిమాను చేయాలని మెగాస్టార్ చిరంజీవి ఎప్పటినుంచో కల కన్నారు. కానీ ఆ కల కలగానే మిగిలిపోయింది ప్రస్తుతానికి. ప్రస్తుతం శంకర్ కమలహాసన్ తో భారతీయుడు -2 సినిమాను చేస్తున్నారు. ఇకపోతే రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా “గేమ్ చేంజర్”. వాస్తవానికి ఈ సినిమా 2024 సంక్రాంతికి రిలీజ్ కావాల్సిఉంది, కానీ షూటింగ్ డిలే వలన ఇది కొంచెం వాయిదా పడుతూ వస్తుంది.

ప్రస్తుతానికి ఈ సినిమా రిలీజ్ డేట్ పైన ఇంకా క్లారిటీ రాలేదు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. రీసెంట్ గా ఈ విషయంపై దిల్ రాజు స్పందించారు. “గేమ్ చేంజ‌ర్ సినిమా ఇప్ప‌టికే ఎన‌బై శాతానికి పైగా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. రాజ‌మౌళి, శంక‌ర్, సుకుమార్‌, సందీప్ వంగా వంటి వారిని టైమ్ అడ‌గ‌కూడ‌దు. శంక‌ర్‌గారు ఆయ‌న ప్లానింగ్ ప్ర‌కారం షూటింగ్ పూర్తి చేసుకుంటూ వ‌స్తున్నారు. సినిమా చిత్రీక‌ర‌ణ ఫైన‌ల్ స్టేజ్‌లో ఉంది. అంతా పూర్త‌యిన త‌ర్వాత ఆయ‌న పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ స‌మ‌యం చెప్పే దాన్ని బ‌ట్టి రిలీజ్ డేట్ చెబుదాం” అంటూ దిల్ రాజు ఈ సినిమా గురించి చెప్పుకొచ్చాడు.

- Advertisement -

For More Updates : Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు