Salaar: స్టోరీ లింక్ ఏమో గాని సెట్లు మాత్రం అవే..!

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన “సలార్” సినిమా డిసెంబర్ 22 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఇండియా వైడ్ గా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడం వల్ల ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి వెళ్లిపోయాయి. పైగా ఈ సినిమా నుండి ఒక్క ఫస్ట్ లుక్ గ్లిమ్ప్స్ తప్ప ఇప్పటివరకు ఏ వీడియో గాని, సాంగ్ గాని రిలీజ్ కాలేదు. ఎదో అప్పుడప్పుడూ కొన్ని స్టిల్స్ లీక్ అవడం తప్ప, మూవీ గురించి, దాని స్టోరీ గురించి ఏమాత్రం కూడా డైరెక్టర్ రివీల్ చేయలేదు.

కానీ సలార్ సినిమాని కెజిఎఫ్ కి లింక్ చేసాడని, ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్ లో ఈ సినిమా ఒకటి అని, కెజిఎఫ్ కి సలార్ కి ముడిపెట్టాడని సినిమా స్టిల్స్ ఎప్పుడు లీక్ అయినా, ఇవే టాపిక్స్ ట్రెండ్ అయ్యేవి. పైగా సినిమా టీజర్ కూడా అలాంటి ఫీలింగ్ నే కనిపించింది.

కానీ లేటెస్ట్ గా ట్రైలర్ రిలీజ్ అయ్యాక సినిమాపై ఓ క్లారిటీ వచ్చిందని చెప్పాలి. సలార్ ట్రైలర్ తాజాగా రిలీజ్ కాగా, ఆ ట్రైలర్ లో సలార్ స్టోరీ లైన్ పై ఓ అవగాహన రాగా, మరో విషయంపై క్లారిటీ వచ్చింది ఆడియన్స్ కి. సలార్ సినిమాలో కెజిఎఫ్ విలన్ (గరుడ)రామచంద్ర రాజు కూడా ఉన్నాడు. అతడు కెజిఎఫ్ లో చనిపోతాడు. కానీ ఇందులో కనిపిస్తాడు, చనిపోయిన వ్యక్తి మళ్ళి రావడం దాదాపు జరగదు కాబట్టి, సలార్ కి కెజిఎఫ్ కి పెద్దగా లింక్ ఉండకపోవచ్చని అనిపిస్తుంది.

- Advertisement -

కానీ సలార్ లో చాలా వరకు సెట్స్ కెజిఎఫ్ సినిమా కి సంబంచించినవే వాడడం జరిగింది. అది క్లియర్ గా తెలుస్తుంది. అయితే రెండు సినిమాల మేకర్స్ ఒక్కరే కావడం వల్ల బహుశా బడ్జెట్ కంట్రోల్ చేయడానికి వాడరేమో అనిపించక మానదు. మరి ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్ నిజంగా ఉందా అంటే ట్రైలర్ ద్వారా లేదనే క్లారిఫికేషన్ 90 శాతం చెప్పొచ్చు. మరి సలార్ రిలీజ్ ఈ విషయం పై మొత్తం క్లారిటీ రావచ్చు.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు