Salaar: సలార్ ట్రైలర్ వచ్చేసింది.. ఎలా వుందంటే..?

పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం సలార్.. ఈ చిత్రం మోస్ట్ అవైడడ్ చిత్రం గా టాలీవుడ్ తో పాటు పాన్ ఇండియా లెవెల్ లో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ సినిమా ట్రైలర్ కోసం దాదాపుగా కొన్ని నెలల నుంచి అభిమానులు సైతం ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా ట్రైలర్ కొన్ని నిమిషాల క్రితం విడుదలై పెను సంచలనాలను సృష్టిస్తోంది. ముఖ్యంగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తూ ఉండడంతో ఈ సినిమాకి భారీ క్రేజ్ ఏర్పడింది.

హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తూ ఉండగా జగపతిబాబు కీలకమైన పాత్రలో నటిస్తూ ఉండగా.. పృధ్విరాజ్ సుకుమారన్ ఇందులో ప్రభాస్ ని ఢీకొట్టే పాత్రలో కనిపిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అంటూ అభిమానులు కూడా ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. ఈ సినిమాని ఇప్పటికే రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో విడుదలైన పోస్టర్ , టీజర్ తో ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేశారు ఇప్పుడు తాజాగా ట్రైలర్ తో మరింత హైట్ పెరిగిపోతుంది.

హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరుగుతుంది. కేజిఎఫ్ ని మించి యాక్షన్ సన్నివేశాలతో ఈ ట్రైలర్ ఉన్నట్లుగా కనిపిస్తోంది. ట్రైలర్ 3:47 సెకండ్లు ఉంది. సలార్ సినిమాతో ప్రభాస్ సరికొత్త రికార్డులను సైతం సృష్టించడం ఖాయం అంటూ ఈ ట్రైలర్ చూసిన అభిమానుల సైతం తెలుపుతున్నారు. ఐదు భాషలలో ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు ఈ చిత్రం డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదల కాబోతోంది.

- Advertisement -

యూ ఎస్ ఏ లో సలార్ సినిమా ఒకరోజు ముందుగా విడుదలవుతుంది.. అంటే డిసెంబర్ 21న విడుదల కాబోతోంది. ట్రైలర్ సైతం ప్రతి ఒక్కరిని గూస్ బంప్స్ తెప్పించేలా కనిపిస్తున్నాయి. ట్రైలర్ లో ప్రభాస్ చాలా స్టైలిష్ గా కనిపిస్తూ ఉన్నారు. ఈ సినిమా ఇద్దరి స్నేహితుల మధ్య జరిగే ఎటువంటి కథాంశం అన్నట్లుగా ట్రైలర్లో చూపించడం జరిగింది. దేవ పాత్రలో ప్రభాస్ నటిస్తూ ఉన్నారు. ఇందులో చాలామంది నటీనటులు సైతం కీలకమైన పాత్రలు నటిస్తున్నట్లు తెలుస్తోంది హోం భలే ఫిలిమ్స్ బ్యానర్ వారు భారీ బడ్జెట్లోనే చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. అయితే ఈ సినిమా ట్రైలర్ కే జి ఎఫ్ సినిమాకు లింకు ఉన్నట్లుగా చూపించడం జరిగింది. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ వైరల్ గా మారుతోంది.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు